Breaking News

పాకిస్తాన్‌ ట్రై సిరీస్‌ నుంచి స్టార్‌ ప్లేయర్‌ ఔట్‌

Published on Mon, 11/10/2025 - 19:59

నవంబర్‌ 17 నుంచి పాకిస్తాన్‌లో జరిగే ముక్కోణపు టీ20 సిరీస్‌ నుంచి జింబాబ్వే స్టార్‌ బౌలర్‌ బ్లెస్సింగ్‌ ముజరబానీ వైదొలిగాడు. వెన్ను గాయం కారణంగా ముజరబానీ ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ముజరబానీ స్థానాన్ని న్యూమన్‌ న్యామ్హురితో భర్తీ చేస్తున్నట్లు జింబాబ్వే క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఈ టోర్నీలో జింబాబ్వే, ఆతిథ్య పాక్‌తో పాటు శ్రీలంక జట్టు పాల్గొంటుంది.

ఈ టోర్నీలో జింబాబ్వే జట్టుకు సికందర్‌ రజా నాయకత్వం వహిస్తున్నాడు. టోర్నీలో ఓపెనర్‌లో పాకిస్తాన్‌, జింబాబ్వే తలపడతాయి. రావల్పిండి వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతుంది. నవంబర్‌ 19న జరిగే రెండో మ్యాచ్‌లో శ్రీలంక, జింబాబ్వే పోటీపడతాయి. ఈ మ్యాచ్‌కు కూడా రావాల్పిండేనే ఆతిథ్యమివ్వనుంది.

అనంతరం నవంబర్‌ 22వ తేదీ పాకిస్తాన్‌-శ్రీలంక, 23న జింబాబ్వే-పాకిస్తాన్‌, 27న పాకిస్తాన్‌-శ్రీలంక పోటీపడతాయి. 29న లాహోర్‌ వేదికగా ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది.

పాకిస్తాన్‌ ట్రై సిరీస్‌ కోసం జింబాబ్వే జట్టు: సికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, గ్రేమ్ క్రీమర్, బ్రాడ్లీ ఎవాన్స్, క్లైవ్ మదాండే, టినోటెండా మపోసా, వెల్లింగ్టన్ మసకద్జా, తడివానాషే మారుమణి, టోనీ మున్యోంగా, తషింగా ముసెకివా, డియాన్‌ మేయర్స్‌, రిచర్డ్‌ నగరవ, న్యూమన్‌ న్యామ్హురి, బ్రెండన్‌ టేలర్

చదవండి: వర్షార్పణం.. ఆధిక్యంలో న్యూజిలాండ్‌

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)