Breaking News

అరంగేట్రంలోనే సెంచరీ.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా టీనేజర్‌

Published on Sat, 06/28/2025 - 21:32

జింబాబ్వే-ద‌క్షిణాఫ్రికా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ సిరీస్‌కు ప్రోటీస్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ టెంబా బావుమా గాయం కారణంగా దూరం కాగా.. కేశవ్‌ మహరాజ్‌ (Keshav Maharaj) సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 

ఇక రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వే- సౌతాఫ్రికా (ZIM vs SA) మధ్య శనివారం తొలి టెస్టు ఆరంభమైంది. బులవాయోలోని క్వీన్స్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో టాస్‌ గెలిచిన పర్యాటక సౌతాఫ్రికా జట్టు.. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

కుప్పకూలిన టాపార్డర్‌
ఈ క్రమంలో ఆతిథ్య జింబాబ్వే బౌలర్లు ధాటిగా తమ అటాకింగ్‌ ఆరంభించారు. టనకా చివాంగ దెబ్బకు ఓపెనర్లు టోనీ డి జోర్జి (0), మాథ్యూ బ్రీట్జ్కే (13) త్వరత్వరగా పెవిలియన్‌ చేరారు. ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌ వియాన్‌ ముల్దర్‌ (17) రనౌట్‌ కాగా.. నాలుగో నంబర్‌ బ్యాటర్‌ డేవిడ్‌ బెడింగ్‌హామ్‌ ​కూడా పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.

లువాన్‌-డ్రి ప్రిటోరియస్‌, బాష్‌ శతకాలు
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అరంగేట్ర బ్యాటర్‌ లువాన్‌-డ్రి ప్రిటోరియస్‌ (Lhuan-Dre Pretorius) భారీ శతకంతో సత్తా చాటాడు. మొత్తంగా 160 బంతులు ఎదుర్కొన్న పందొమిదేళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 153 పరుగులు సాధించాడు. ఇతడికి తోడుగా చిచ్చరపిడుగు డెవాల్డ్‌ బ్రెవిస్‌ (51) అర్ధ శతకంతో మెరవగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కైలీ వెరెన్నె (10) మాత్రం నిరాశపరిచాడు.

అయితే, బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కార్బిన్‌ బాష్‌ కూడా శతకంతో చెలరేగడం విశేషం. మిగతా వాళ్లలో కెప్టెన్‌ కేశవ్‌ మహరాజ్‌ 21, కోడీ యూసఫ్‌ 27 పరుగులు చేశారు. శనివారం నాటి తొలి రోజు ఆట ముగిసేసరికి 90 ఓవర్లలో సౌతాఫ్రికా తొమ్మిది వికెట్ల నష్టానికి 418 పరుగులు సాధించింది. బాష్‌ 100, క్వెనా మఫాకా 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.

చరిత్ర సృష్టించిన ప్రిటోరియస్‌
జింబాబ్వేతో మ్యాచ్‌లో శతక్కొట్టిన లువాన్‌-డ్రి ప్రిటోరియస్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికా తరఫున పురుషుల క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు.. అరంగేట్రంలోనే టెస్టుల్లో శతకం బాదిన అత్యంత పిన్న వయస్కుడిగానూ నిలవడం విశేషం.

ఈ క్రమంలో సౌతాఫ్రికా తరఫున 61 ఏళ్లుగా గ్రేమ్‌ పొలాక్‌ పేరిట ఉన్న రికార్డును ప్రిటోరియస్‌ బద్దలు కొట్టాడు. 1964లో ఆస్ట్రేలియా మీద 19 ఏళ్ల 317 రోజుల్లో పొలాక్‌ సెంచరీ చేయగా.. ప్రిటోరియస్‌ 19 ఏళ్ల 93 రోజుల వయసులో జింబాబ్వే మీద ఈ ఘనత సాధించాడు.

చదవండి: నితీశ్‌ రెడ్డి కాదు!.. శార్దూల్‌ స్థానంలో అతడే సరైనోడు: భారత మాజీ క్రికెటర్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)