Breaking News

T20 WC 2026: సంజూ శాంసన్‌పై వేటు!?

Published on Mon, 01/26/2026 - 12:16

భారత టీ20 జట్టు ఓపెనర్లుగా గత కొంతకాలంగా సంజూ శాంసన్‌- అభిషేక్‌ శర్మ జోడీ కొనసాగుతోంది. ఆసియా టీ20 కప్‌ సందర్భంగా శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) టీమ్‌లోకి తిరిగి రావడంతో కొన్నాళ్లపాటు సంజూ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అయితే, గిల్‌ కూడా ఓపెనర్‌గా విఫలం కావడం సంజూకు కలిసి వచ్చింది.

ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో కూడా సంజూ శాంసన్‌కే ఓపెనర్‌గా అవకాశం దక్కింది. టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌ అయిన గిల్‌పై వేటు వేసి మరీ.. ఈ కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌కు మరో అవకాశం ఇచ్చింది యాజమాన్యం.

సెలక్టర్ల వమ్ము చేస్తున్న సంజూ
అయితే, సంజూ మాత్రం సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టలేకపోతున్నాడు. కివీస్‌తో మూడు మ్యాచ్‌లలో అతడు చేసిన స్కోర్లు (10, 6, 0) ఇందుకు నిదర్శనం. మరోవైపు.. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్‌ కిషన్‌ అద్భుత ప్రదర్శనలతో దుమ్ములేపుతున్నాడు.

పేలుతున్న జార్ఖండ్‌ డైనమైట్‌
న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌లో విఫలమైనా (8).. రెండో టీ20లో 32 బంతుల్లో 76, మూడో టీ20లో 13 బంతుల్లో 28 పరుగులతో సత్తా చాటాడు ఇషాన్‌. తద్వారా జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా దూసుకుపోతున్నాడు ఈ జార్ఖండ్‌ డైనమైట్‌.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. సంజూ వైఫల్యాలు కొనసాగితే.. వరల్డ్‌కప్‌ టోర్నీలో భారత తుదిజట్టు నుంచి అతడిని తప్పించడం ఖాయమని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా ఇషాన్‌ కిషన్‌ను జట్టు నుంచి ఎవరూ తప్పించలేరని పేర్కొన్నాడు.

ఇషాన్‌ను తుదిజట్టు నుంచి తప్పించలేరు
"ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే సెలక్టర్లు ఇషాన్‌ను తుదిజట్టు నుంచి తప్పించలేరు. ఇందుకు అవకాశమే లేదు. సంజూ శాంసన్‌ కంటే అతడు ఎంతో మెరుగ్గా ఆడుతున్నాడు. సంజూను చూస్తుంటే బాధగా ఉంది.

పరుగులు చేయాలనే కసి అతడిలో కనిపిస్తోంది. కానీ సరిగ్గా ఆడలేకపోతున్నాడు. గత మ్యాచ్‌లో కనీసం నామమాత్రపు స్కోరైనా చేసి ఉండాల్సింది. నిలకడలేని ఆట తీరే సంజూకు ప్రధాన సమస్య. ఏడాదిన్నర క్రితం సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఇదే తంతు కొనసాగుతోంది.

సంజూపై వేటు తప్పదు
ఏదేమైనా సంజూ దురదృష్టవంతుడనే చెప్పాలి. అతడికి గట్టి పోటీ ఉంది. తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌ జట్టులో పాతుకుపోయే ప్రయత్నంలో ఉన్నారు. అభిషేక్‌ శర్మను ఎవరూ కదిలించలేరు. ఇషాన్‌ వంటి వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ డేంజరస్‌ ఫామ్‌లో ఉన్నపుడు సంజూ తుదిజట్టులో చోటు కోల్పోయే అవకాశాలే ఎక్కువ’’ అని చిక్కా అభిప్రాయపడ్డాడు. ఓపెనర్‌గా ఇషాన్‌ సంజూ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం లేకపోలేదని పేర్కొన్నాడు.

చదవండి: ICC: వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్‌.. ఆ పని చేయబోము

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)