Breaking News

జైశ్వాల్ అరుదైన ఫీట్‌.. 16 ఏళ్ల గంభీర్ రికార్డు బ‌ద్ద‌లు

Published on Sat, 11/23/2024 - 21:17

పెర్త్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెన‌ర్ యశస్వి జైస్వాల్ అద్బుత‌మైన ప్ర‌దర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫ‌ల‌మైన జైశ్వాల్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సెంచరీ దిశ‌గా సాగుతున్నాడు.

తొలిసారి ఆస్ట్రేలియాలో ఆడుతున్న జైశ్వాల్‌.. స్టార్క్‌, హాజిల్‌వుడ్ వంటి వ‌ర‌ల్డ్‌క్లాస్ ఫాస్ట్ బౌల‌ర్ల‌ను సైతం అలోవ‌క‌గా ఎదుర్కొని అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. ప్ర‌స్తుతం జైశ్వాల్ 90 పరుగుల‌తో క్రీజులో ఉన్నాడు. య‌శ‌స్వి మరో ఓపెన‌ర్ కేఎల్ రాహుల్‌తో క‌లిసి తొలి వికెట్‌కు 172 పరుగుల ఆజేయ భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. 

ఇక ఈ మ్యాచ్‌లో ఆసాద‌ర‌ణ ఇన్నింగ్స్ ఆడుతున్న జైశ్వాల్ ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. ఒక క్యాలెండ‌ర్ ఈయ‌ర్‌లో టెస్టు క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట‌ర్‌గా జైశ్వాల్ రికార్డుల‌కెక్కాడు. ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కు 12 టెస్టులు ఆడిన జైశ్వాల్‌..1170* ప‌రుగులు చేశాడు.

ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా ప్ర‌స్తుత హెడ్ కోచ్ గౌతం గంభీర్ పేరిట ఉండేది. 2008లో గంభీర్ ఒక క్యాలెండ‌ర్ ఈయ‌ర్‌లో 8 టెస్టులు ఆడి  1,134 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో గంభీర్ ఆల్‌టైమ్ రికార్డును జైశ్వాల్ బ్రేక్ చేశాడు. 2024లో అత్యధిక టెస్టు పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా యశస్వి కొనసాగుతున్నాడు. ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఇంగ్లండ్‌ లెజెండ్‌ జోరూట్‌(1,338*) ఉన్నాడు.
చదవండి: IND vs AUS: జైశ్వాల్‌, రాహుల్‌కు సెల్యూట్ చేసిన కోహ్లి.. వీడియో వైర‌ల్‌

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)