Breaking News

యశస్వి జైస్వాల్‌ ప్రపంచ రికార్డు.. బ్రాడ్‌మన్‌నే అధిగమించాడు!

Published on Sat, 06/21/2025 - 09:36

టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiwal) అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్‌ జట్టుపై టెస్టు ఫార్మాట్లో అత్యధిక సగటు నమోదు చేసిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌ (Don Bradman)ని జైసూ అధిగమించాడు.

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC) 2025-27 సీజన్‌లో భాగంగా టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య శుక్రవారం (జూన్‌ 20) తొలి టెస్టు మొదలైంది. లీడ్స్‌ వేదికగా టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌ ఎంచుకుని.. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

భారత్‌ బ్యాటింగ్‌ అదుర్స్‌.. జైసూ, గిల్‌ సెంచరీలు
ఇక ఆది నుంచే జోరు కనబరిచిన భారత్‌ మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి 85 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు సాధించింది. ఆద్యంతం ఆకట్టుకుని తొలి రోజు పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (42) స్వల్ప స్కోరుకు వెనుదిరిగినా.. మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ శతకంతో కదం తొక్కాడు.

మరో సెంచరీ వీరుడు, కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌తో కలిసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. మొత్తంగా 159 బంతులు ఎదుర్కొన్న జైసూ.. 16 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 101 పరుగులు చేసి.. స్టోక్స్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.

బ్రాడ్‌మన్‌ రికార్డు బద్దలు
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌ గడ్డ మీద జైసూకు ఇదే తొలి సెంచరీ కాగా.. ఓవరాల్‌గా పది ఇన్నింగ్స్‌లో కలిపి 813 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఏకంగా 90.33 సగటుతో ఈ మేర రన్స్‌ రాబట్టాడు. ఈ క్రమంలోనే బ్రాడ్‌మన్‌ రికార్డును జైస్వాల్‌ బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్‌ మీద టెస్టుల్లో అత్యధిక సగటుతో పరుగులు రాబట్టిన ఆటగాడిగా నిలిచాడు.

ఇక శుక్రవారం నాటి తొలి రోజు ఆట పూర్తయ్యే సరికి గిల్‌ 127 పరుగులతో.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు. మరోవైపు.. అరంగేట్ర బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ మాత్రం నిరాశపరిచాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు.

ఇంగ్లండ్‌ జట్టుపై అత్యధిక టెస్టు యావరేజ్‌ కలిగిన బ్యాటర్లు
🏏యశస్వి జైస్వాల్‌- 90.33
🏏డాన్‌ బ్రాడ్‌మన్‌- 89.78
🏏స్టీవీ డెంప్‌స్టర్‌- 88.42
🏏లారెన్స్‌ రోవ్‌- 74.20
🏏జార్స్‌ హెడ్లీ- 71.23  

చదవండి: వాళ్లని మెచ్చుకోవడంలో తప్పులేదు.. అతడిని ఇప్పటికైనా వదిలేయ్‌!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)