Breaking News

WTC Points Table: అగ్రస్థానంలో టీమిండియా.. పాక్‌ కూడా మనవెంటే!

Published on Fri, 07/21/2023 - 17:19

ICC World Test Championship- 2023 - 2025: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే టీమిండియా అదరగొట్టిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో డొమినికా వేదికగా జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ సేన ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా కరేబియన్‌ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగా.. అరంగేట్ర బ్యాటర్‌ యశస్వి జైశ్వాల్‌ 171 పరుగులతో చెలరేగాడు.

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాపర్‌
ఈ నేపథ్యంలో భారత జట్టు ఏకంగా ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో గెలుపొందింది. జూలై 12న మొదలై మూడు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో ఈ విజయం ద్వారా 12 పాయింట్లు సాధించిన టీమిండియా డబ్ల్యూటీసీ పట్టికలో అగ్రస్థానం ఆక్రమించింది. అయితే, దాయాది జట్టు కూడా రోహిత్‌ సేనను అనుసరించడం విశేషం.

పాక్‌ కూడా మనవెంటే
కాగా పాకిస్తాన్‌ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో బాబర్‌ ఆజం బృందం 4 వికెట్ల తేడాతో గెలిచింది. జూలై 16న మొదలై ఐదురోజుల పాటు సాగిన మ్యాచ్‌లో ఆతిథ్య లంకను చిత్తు చేసింది. 

కాగా పాక్‌కు కూడా తాజా డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఇదే తొలి మ్యాఛ్‌ కావడం విశేషం. దీంతో.. 12 పాయింట్లతో టీమిండియాతో సంయుక్తంగా ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ సీజన్లో ఇంగ్లండ్‌తో యాషెస్‌ సిరీస్‌లో భాగంగా.. ఇప్పటి వరకు మూడు టెస్టులాడిన చాంపియన్‌ ఆస్ట్రేలియా.. రెండింట గెలిచి.. ఒక మ్యాచ్‌లో ఓడింది.

చాంపియన్‌ ఎక్కడంటే
ఈ క్రమంలో 22 పాయింట్లు(61.11శాతం) సాధించి మూడో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్‌ 10 పాయింట్ల(పెనాల్టీ పడటం వల్ల రెండు పాయింట్లు మైనస్‌)తో నాలుగోస్థానంలో ఉంది. మిగతా జట్లలో శ్రీలంక, వెస్టిండీస్‌ ఒక్కో ఓటమితో టాప్‌ 7, 8 స్థానాల్లో ఉన్నాయి. మిగతా వాటిలో బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా ఇంకా ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.  ఇదిలా ఉంటే.. ట్రినిడాడ్‌ వేదికగా టీమిండియా- వెస్టిండీస్‌ మధ్య రెండో టెస్టు గురువారం మొదలుకాగా.. జూలై 24 నుంచి శ్రీలంక- పాక్‌ రెండో టెస్టు ఆరంభం కానుంది.

చదవండి: మొన్న రుతురాజ్‌ గైక్వాడ్‌.. ఇప్పుడు టీమిండియాకు మరో కొత్త కెప్టెన్‌!  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)