త్రివిక్రమ్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ తో రామ్ చరణ్!
Breaking News
WTC: సిరీస్ క్లీన్‌స్వీప్.. రెండో స్థానానికి దూసుకొచ్చిన టీమిండియా
Published on Sun, 12/25/2022 - 12:38
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకొచ్చింది. వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌ను వరుసగా రెండోసారి ఆడేందుకు టీమిండియాకు మరోసారి అవకాశం వచ్చింది.
బంగ్లాతో టెస్టు సిరీస్ ద్వారా 8 విజయాలు ఖాతాలో వేసుకున్న భారత్ 58.93 పర్సంటేజీ పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. 13 విజయాలతో ఉన్న ఆస్ట్రేలియా 76.92 పర్సంటేజీ పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో 54.55 పర్సంటేజీ పాయింట్లతో దక్షిణాఫ్రికా ఉంది. డిసెంబర్ 26 నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య మొదలుకానున్న బాక్సింగ్ డే టెస్టులో వచ్చే ఫలితం ఆధారంగా స్థానాలు మారే అవకాశం ఉంది.
ఆ తర్వాత శ్రీలంక(53.33), ఇంగ్లండ్(46.97 పాయింట్లు)తో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఇటీవలే ఇంగ్లండ్ చేతిలో వైట్‌వాష్ అయిన పాకిస్తాన్ 38.89 పాయింట్లతో ఏడో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ 25.93 పర్సంటేజీ పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. టీమిండియా చేతిలో క్లీన్‌స్వీప్ అయిన బంగ్లాదేశ్ 11.11 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది.
A series sweep against Bangladesh has put India in a strong position to make it to the #WTC23 final 🔥
— ICC (@ICC) December 25, 2022
Here's how your team can qualify 👇 https://t.co/Y7vRhKPWYW
చదవండి: అయ్యర్, అశ్విన్‌ల ఖాతాలో ప్రపంచ రికార్డు
భయపెట్టిన బంగ్లా బౌలర్‌ను ఉతికారేసిన అశ్విన్
Tags : 1