Breaking News

అదే జరిగితే టీమిండియా కొంప కొల్లేరే..!

Published on Thu, 10/30/2025 - 11:54

మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్‌ 30) భారత్‌, ఆస్ట్రేలియా (India vs Australia) జట్ల మధ్య రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా జరిగే ఈ నాకౌట్‌ సమరం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాను వరుణుడు పరీక్షించబోతున్నాడు.

ఈ మ్యాచ్‌కు వాతావరణం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. AccuWeather నివేదిక ప్రకారం, DY పాటిల్ స్టేడియం పరిసరాల్లో ఇవాళ ఉదయం ఆకాశం 93 శాతం మేఘావృతంగా ఉంటుంది. 25 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది.

మ్యాచ్‌ సమయానికి పరిస్థితులు మెరుగవుతాయన్న అంచనా ఉన్నా, నవీ ముంబైలో వాతావరణ పరిస్థితులను నమ్మడానికి వీల్లేదు. ఈనెల 28న ఇక్కడ జరగాల్సిన భారత్‌, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ భారీ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌ను కూడా వర్షం​ ముంచేస్తుందేమోనని భారత క్రికెట్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

మ్యాచ్ పూర్తిగా రద్దైతే..?
ఒకవేళ నేటి మ్యాచ్‌ వర్షం కారణంగా పూర్తిగా రద్దైనా రిజర్వ్‌ డే (అక్టోబర్‌ 31) ఉంది. ఇవాళ ​కొంత మ్యాచ్‌ జరిగి ఆగిపోయినా, ఇదే స్థితి నుంచి రిజ్వర్‌ డేలో కొనసాగుతుంది. ఒకవేళ రిజర్వ్‌ డేలో కూడా మ్యాచ్‌ సాధ్యపడకపోతే మాత్రం టీమిండియా కొంప కొల్లేరవుతుంది. 

గ్రూప్‌ దశలో భారత్‌ కంటే ఎక్కువ పాయింట్లు ఉండటం చేత ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంటుంది. గ్రూప్‌ దశలో ఆసీస్‌ 7 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని జట్టుగా 13 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. భారత్‌ 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 7 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.

ఇదిలా ఉంటే, నిన్న (అక్టోబర్‌ 29) జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. కెప్టెన్‌ లారా వోల్వార్డ్ట్‌ (169) రికార్డు శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

అనంతరం లక్ష్య ఛేదనలో మారిజన్‌ కాప్‌ (7-3-20-5) చెలరేగడంతో ఇంగ్లండ్‌ 42.3 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటై 125 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది.

చదవండి: పెను విషాదం.. ఆస్ట్రేలియా యువ క్రికెటర్‌ మృతి

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)