Breaking News

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్మృతి మంధన సూపర్‌ సెంచరీ

Published on Thu, 10/23/2025 - 17:15

మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధన (Smriti Mandhana) సూపర్‌ సెంచరీతో కదంతొక్కింది. నవీ ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్‌ 23) జరుగుతున్న మ్యాచ్‌లో 88 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసింది. 

మంధనకు ఈ ఏడాది ఇది ఐదో శతకం. ఓవరాల్‌గా వన్డేల్లో 14వ శత​కం. ప్రస్తుత ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన మంధన.. గత రెండు మ్యాచ్‌లుగా సత్తా చాటుతూ వస్తుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో జరిగిన చివరి రెండు మ్యాచ్‌ల్లో బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో మెరిసింది. వాస్తవానికి ఆ రెండు అర్ద సెంచరీలు కూడా సెంచరీల్లోకి మారాల్సింది. అయితే అవి తృటిలో చేజారాయి.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి న్యూజిలాండ్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. ఆది నుంచి నిలకడగా ఆడింది. ఓపెనర్లు మంధన, ప్రతీక రావల్‌ (77) సంయమనంతో బ్యాటింగ్‌ చేస్తూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. 

అర్ద సెంచరీ తర్వాత మంధన గేర్‌ మార్చగా.. ‍ప్రతీక రావల్‌ అదే టెంపోలో బ్యాటింగ్‌ చేస్తుంది. 31 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ వికెట్‌ నష్టపోకుండా 192 పరుగులుగా ఉంది. మంధన 100, ప్రతీక రావల్‌ 77 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

కాగా, ప్రస్తుత ప్రప​ంచకప్‌లో మొదటి మూడు సెమీస్‌ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగో సెమీస్‌ బెర్త్‌ కోసం భారత్‌, న్యూజిలాండ్‌ పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. మరోపక్క బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. 

చదవండి: IND vs AUS: టీమిండియాపై ఆసీస్‌ గెలుపు.. సిరీస్‌ కైవసం

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)