Breaking News

ఒక్క మ్యాచ్‌కే అత‌డిపై వేటు.. డేంజ‌ర‌స్ బ్యాట‌ర్‌కు ఛాన్స్‌?

Published on Mon, 12/01/2025 - 18:31

సౌతాఫ్రికాతో మూడు వ‌న్డేల సిరీస్‌ను టీమిండియా అద్భుతమైన విజ‌యంతో ప్రారంభించింది. రాంచీ వేదిక‌గా జ‌రిగిన తొలి వ‌న్డేలో ప‌ర్యాట‌క ప్రోటీస్ జ‌ట్టును 17 ప‌రుగుల తేడాతో భార‌త్ ఓడించింది. అయితే ఈ మ్యాచ్‌లో భార‌త్ గెలిచిన‌ప్ప‌టికి స‌రిదిద్దుకోవాల్సిన త‌ప్పులు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో రాహుల్ సేన ఇంకా మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయాల్సింది.

జ‌స్ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్ లేని లోటు స్ప‌ష్టంగా క‌న్పించింది. 350 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని కాపాడుకునేందుకు భార‌త బౌల‌ర్లు తీవ్రంగా శ్ర‌మించారు. ఓ ద‌శ‌లో జాన్సెన్, బాష్ జోరు చూస్తే స‌ఫారీలదే మ్యాచ్ అన్న‌ట్లు అన్పించింది. కానీ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ మ‌యాజాలంతో ఓట‌మి నుంచి మెన్ బ్లూ గ‌ట్టెక్కింది.

అదేవిధంగా రాంచీ వ‌న్డేలో భార‌త మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్లు కూడా విఫ‌ల‌మ‌య్యారు. ఛాన్నాళ్ల త‌ర్వాత జ‌ట్టులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్(8) ఏ మాత్రం ప్ర‌భావం చూపలేక‌పోయాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్(13) కూడా నామ‌మాత్ర‌పు స్కోరుకే ప‌రిమిత‌మ‌య్యాడు.

వారిద్ద‌రిపై వేటు.. 
ఈ నేప‌థ్యంలో బుధ‌వారం రాయ్‌పూర్ వేదిక‌గా స‌ఫారీల‌తో జ‌రిగే రెండో వ‌న్డేలో భార‌త్ ప‌లు మార్పుల‌తో బ‌రిలోకి దిగే అవ‌కాశ‌ముంది.తొలి వన్డేలో విఫ‌ల‌మైన రుతురాజ్ గైక్వాడ్‌, సుంద‌ర్‌ల‌పై వేటు వేసేందుకు మెనెజ్‌మెంట్ సిద్ద‌మైన‌ట్లు స‌మాచారం.

రుతు స్ధానంలో స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్‌, సుంద‌ర్ స్ధానంలో ఆంధ్ర ఆల్‌రౌండ‌ర్ నితీష్ కుమార్ జ‌ట్టులోకి రానున్న‌ట్లు బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. పంత్ గ‌తేడాది చివ‌ర‌గా భార‌త్ త‌ర‌పున వ‌న్డే మ్యాచ్ ఆడాడు. మ‌ళ్లీ ఇప్పుడు ఏడాది త‌ర్వాత ఈ డేంజ‌ర‌స్ బ్యాట‌ర్  బ్లూ జెర్సీలో క‌న్పించ‌నున్నాడు. 

గ‌త మ్యాచ్‌లో సుంద‌ర్ కేవ‌లం మూడు ఓవ‌ర్లు మాత్ర‌మే బౌలింగ్ చేశాడు. జ‌ట్టులో స్పిన్న‌ర్లు కుల్దీప్ యాద‌వ్‌తో పాటు రవీంద్ర జ‌డేజా ఉండ‌డంతో సుంద‌ర్‌ను బెంచ్‌కు ప‌రిమితం చేయాల‌ని గంభీర్ యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. నితీష్ బ్యాట్‌తో పాటు మీడియం పేస్ బౌల‌ర్‌గా కూడా త‌న సేవ‌ల‌ను అందించనున్నాడు. అయితే స‌ఫారీల‌తో జ‌రిగిన రెండో టెస్టులో మాత్రం నితీష్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న కన‌బ‌రిచాడు.

రెండో వ‌న్డేకు భార‌త తుది జ‌ట్టు(అంచనా)
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, రిష‌బ్ పంత్‌, కేఎల్ రాహుల్‌, నితీశ్ కుమార్ రెడ్డి, ర‌వీంద్ర జ‌డేజా, హ‌ర్షిత్ రాణా, కుల్దీప్ యాద‌వ్‌, అర్ష్‌దీప్ సింగ్‌
చదవండి: రోహిత్‌తో గంభీర్‌ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!.. బీసీసీఐ సీరియస్‌!
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)