తుది నిర్ణయం వారిదే: గంభీర్ ‘తొలగింపు’పై బీసీసీఐ స్పందన

Published on Thu, 01/29/2026 - 10:55

స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో టెస్టుల్లో 3-0తో వైట్‌వాష్‌.. ఆస్ట్రేలియాకు పదేళ్ల తర్వాత బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ కోల్పోవడం.. సొంతగడ్డపై పాతికేళ్ల తర్వాత తొలిసారి సౌతాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్‌లో 2-0తో వైట్‌వాష్‌.. తాజాగా స్వదేశంలో తొలిసారి న్యూజిలాండ్‌కు వన్డే సిరీస్‌ (2-1) కోల్పోవడం..

పదవి నుంచి తొలగించాలి
గౌతం గంభీర్‌ హెడ్‌కోచ్‌గా వచ్చిన తర్వాత టీమిండియా చవిచూసిన ఘోర పరాభవాలు ఇవి.. ఈ నేపథ్యంలో అతడిని పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరిగాయి. భారత జట్టు అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు సైతం ఇంచుమించు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి ఒక్కరు క్రికెట్‌ నిపుణులే
ఈ విషయంపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్‌ సైకియా వ్యంగ్యరీతిలో స్పందించారు. ‘‘ఇండియాలో 140 కోట్ల మందితో కూడిన దేశం. ఇక్కడ ప్రతి ఒక్కరు క్రికెట్‌ నిపుణులే. ప్రతి ఒక్కరికి వారికంటూ ఓ అభిప్రాయం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య దేశం.

కాబట్టి మనం ఎవరినీ మాట్లాడకుండా ఆపలేము. మీడియా సహా అందరూ తమ అభిప్రాయాలను చెబుతూనే ఉంటారు. వార్తా సంస్థలు, మాజీ క్రికెటర్లు, క్రికెటర్లు.. ఇతర వ్యక్తులు అంతా ఎప్పటికప్పుడు తమకు నచ్చినట్లుగా మాట్లాడుతూనే ఉంటారు. ఇది సోషల్‌ మీడియా యుగం.

వారిదే తుది నిర్ణయం
అయితే, బీసీసీఐలో క్రికెట్‌ కమిటీ ఉంటుంది. అందులో మాజీ క్రికెటర్లు ఉంటారు. వారే అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మరోవైపు.. జట్టు ఎంపిక కోసం ఐదుగురు సెలక్టర్లు ఉన్నారు. వాళ్లు కూడా అర్హత ప్రకారమే ఆ స్థానానికి చేరుకున్నారు. వాళ్లకంటూ కొన్ని నిర్ణయాలు ఉంటాయి.

అయితే, ఇతరులు వాటితో విభేదించవచ్చు. అయినప్పటికీ బోర్డులోని వ్యక్తుల మాటలు, నిర్ణయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము. క్రికెట్‌ కమిటీ, సెలక్టర్లదే తుది నిర్ణయం’’ అని దేవజిత్‌ సైకియా స్పోర్ట్స్‌స్టార్‌తో పేర్కొన్నారు. 

చదవండి: Suryakumar Yadav: ఓడినా పర్లేదు.. మా ప్లాన్ అదే

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)