Breaking News

WI Vs NZ: రోహిత్‌ రికార్డు బద్దలు కొట్టిన గప్టిల్‌.. మరోసారి ప్రపంచ నంబర్‌ 1గా!

Published on Mon, 08/15/2022 - 16:27

న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేరిట ఉన్న రికార్డును గప్టిల్‌ బద్దలు కొట్టాడు. వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా మూడో టీ20 సందర్భంగా ఈ ఫీట్‌ నమోదు చేశాడు.

కాగా విండీస్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పర్యాటక కివీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన గప్టిల్‌ 13 బంతుల్లో 15 పరుగులు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ టీ20లలో 3497 పరుగుల మార్కును అందుకున్నాడు. దీంతో పురుషుల టీ20 క్రికెట్‌లో ప్రస్తుతం టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కాగా గప్టిల్‌- రోహిత్‌ శర్మ మధ్య నెంబర్‌ 1 స్థానం కోసం పోటీ కొనసాగుతూనే ఉంది.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. న్యూజిలాండ్‌ బ్యాటర్లలో గ్లెన్‌ ఫిలిప్స్‌(41) మినహా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో కివీస్‌ 145 పరుగులకే పరిమితమైంది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య వెస్టిండీస్‌.. ఓపెనర్లు బ్రాండన్‌ కింగ్‌(53), బ్రూక్స్‌(56 నాటౌట్‌) విజృంభించడంతో జయకేతనం ఎగురవేసింది. 19 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 150 పరుగులు సాధించింది. తద్వారా 8 వికెట్ల తేడాతో గెలిచి మూడు టీ20ల సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌ గండం నుంచి తప్పించుకుంది. ఇక మొదటి రెండు మ్యాచ్‌లలో న్యూజిలాండ్‌ వరుసగా 13, 90 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ సొంతం చేసుకుంది.

అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగుల జాబితాలో టాప్‌-5లో ఉన్న పురుష క్రికెటర్లు
1.మార్టిన్‌ గప్టిల్‌(న్యూజిలాండ్‌)- 3497
2.రోహిత్‌ శర్మ(ఇండియా)- 3487
3.విరాట్‌ కోహ్లి(ఇండియా)- 3308
4.పాల్‌ స్టిర్లింగ్‌(ఐర్లాండ్‌)- 2975
5.ఆరోన్‌ ఫించ్‌(ఆస్ట్రేలియా)- 2855
చదవండి: Hasin Jahan: ఇండియా పేరు మార్చండి.. ప్రధాని మోదీకి క్రికెటర్‌ షమీ ‘భార్య’ అభ్యర్ధన
 Rishabh Pant- Urvashi Rautela: మరీ అంత స్ట్రెస్‌ తీసుకోకు: బాలీవుడ్‌ హీరోయిన్‌కు పంత్‌ మరో కౌంటర్‌!

Videos

పిడుగురాళ్ల CI వేధింపులకు మహిళ ఆత్మహత్యాయత్నం

చిరు, వెంకీ ఊరమస్ స్టెప్స్..!

ఆపరేషన్ సిందూర సమయంలో భారత్ దెబ్బకు పారిపోయి దాక్కున్నాం

హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్

అల్లాడిపోతున్నది అమ్మ మా అనిత.. పేర్నినాని ఊర మాస్ ర్యాగింగ్

ఎవడబ్బ సొమ్మని మా భూమిలోకి వస్తారు.. మీకు చేతనైతే..

ఒక్క బిడ్ రాలేదు.. జగన్ దెబ్బకు బొమ్మ రివర్స్.. పగతో రగిలిపోతున్న చంద్రబాబు

సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్

సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్

టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు

Photos

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)