Breaking News

టీమిండియాకు ఊహించని షాక్‌.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్‌ ప్లేయర్‌

Published on Sun, 12/14/2025 - 20:01

సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది.  స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల వల్ల జట్టును వీడాడు. దీంతో ధర్మశాల వేదికగా సఫారీలతో జరుగుతున్న కీలకమైన మూడో టీ20కు బుమ్రా దూరమయ్యాడు. 

ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా వెల్లడించింది.  "జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల చేత ఇంటికి తిరిగి వెళ్ళాడు. అతడు మూడో టీ20కు అందుబాటులో లేడు. బుమ్రా తదుపరి మ్యాచ్‌లకు జట్టులో చేరే విషయంపై అప్‌డేట్ ఇస్తామని" బీసీసీఐ  పేర్కొంది. 

ఇదే విషయాన్ని టాస్‌ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా చెప్పుకొచ్చాడు. ఇక జస్ప్రీత్ స్ధానంలో యువ పేసర్ హర్షిత్ రాణా తుది జట్టులో వచ్చాడు. బుమ్రాతో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా ధర్మశాల టీ20కు దూరమయ్యాడు. 

దీంతో కుల్దీప్ యాదవ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కింది. అయితే బుమ్రా తిరిగి జట్టులో చేరుతాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు.  ఈ సిరీస్‌లో భాగంగా నాలుగో టీ20 డిసెంబర్ 17న లక్నో వేదికగా జరగనుంది. రెండు రోజుల సమయం లభించడంతో అతడు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముందని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. 

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు తడబడుతున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. హర్షిత్ రాణా రెండు , అర్ష్‌దీప్‌, హార్దిక్ పాండ్యా తలా వికెట్ సాధించారు.

తుది జట్లు
దక్షిణాఫ్రికా: రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్‌ కీపర్‌), ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్‌), డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్

భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్‌కీపర్‌), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
చదవండి: Asia Cup 2025: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా..
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)