Breaking News

రాణించిన రూట్‌, స్టోక్స్‌.. తృటిలో సెంచరీ చేజార్చుకున్న స్మిత్‌

Published on Sun, 07/28/2024 - 15:19

బర్మింగ్హమ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టెయిలెండర్లు సత్తా చాటారు. ఫలితంగా ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది. జో రూట్‌ (87) కెరీర్‌లో 63వ హాఫ్‌ సెంచరీతో రాణించగా.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వికెట్‌ జేమీ స్మిత్‌ (95) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. బెన్‌ స్టోక్స్ (54), క్రిస్‌ వోక్స్‌ (62) అర్ద సెంచరీలతో ఆకట్టుకున్నారు. జాక్‌ క్రాలే 18, బెన్‌ డకెట్‌ 3, మార్క్‌ వుడ్‌ 0, ఓలీ పోప్‌ 10, హ్యారీ బ్రూక్‌ 2 నిరాశపర్చగా.. పదో నంబర్‌ ఆటగాడు గస్‌ అట్కిన్సన్‌ 21 పరుగులు చేశాడు. 

విండీస్‌ బౌలర్లలో అల్జరీ జోసఫ్‌ 4, జేడన్‌ సీల్స్‌ 3, షమార్‌ జోసఫ్‌ 2, గుడకేశ్‌ మోటీ ఓ వికెట్‌ పడగొట్టారు. ఇంగ్లండ్‌ ఆలౌటైన అనంతరం సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన వెస్టిండీస్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 61 పరుగులు వెనుకపడి ఉంది. క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (0), కిర్క్‌ మెక్‌కెంజీ (8) ఔట్‌ కాగా.. మికైల్‌ లూయిస్‌ (18), అలిక్‌ అథనాజ్‌ (5) క్రీజ్‌లో ఉన్నారు. క్రిస్‌ వోక్స్‌, గస్‌ అట్కిన్సన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.  

అంతకుముందు వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ‌282 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (61), జేసన్‌ హోల్డర్‌ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. జాషువ డసిల్వ (49) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అట్కిన్సన్‌ 4, క్రిస్‌ వోక్స్‌ 3, మార్క్‌ వుడ్‌ 2, షోయబ్‌ బషీర్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ తొలి రెండు టెస్ట్‌ల్లో విజయం సాధించి, సిరీస్‌ను ఇదివరకే కైవసం చేసుకుంది. 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)