Breaking News

పాకిస్తాన్‌ మాదిరే మేము కూడా!: బంగ్లాదేశ్‌ ఓవరాక్షన్‌

Published on Wed, 01/07/2026 - 21:01

భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రత ఉండదంటూ బంగ్లాదేశ్‌ మరోసారి ఓవరాక్షన్‌ చేసింది. టీ20 ‍ప్రపంచకప్‌-2026 ఆడేందుకు తమ క్రికెట్‌ జట్టును అక్కడికి పంపలేమని పేర్కొంది. అయితే, అదే సమయంలో తాము మాత్రం టోర్నమెంట్‌ను వైదొలిగేందుకు సిద్ధంగా లేమంటూ తమ ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది.

భారత్‌లో మ్యాచ్‌లు ఆడే పరిస్థితి లేదు
ఈ విషయం గురించి బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (BCB) అధ్యక్షుడు అమినుల్‌ ఇస్లాం, ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ‘‘భారత్‌లో మ్యాచ్‌లు ఆడే పరిస్థితి లేదని మేము ఇప్పటికే ఐసీసీకి అర్థమయ్యేలా చెప్పాము.

మరింత స్పష్టంగా ఈరోజు రాత్రికో.. రేపు ఉదయమో మరోసారి ఇదే విషయాన్ని వారికి చెబుతాము. బంగ్లాదేశ్‌ భద్రత, గౌరవం, మర్యాద విషయంలో మేము ఎంతమాత్రము రాజీపడబోము. అయితే, మేము కచ్చితంగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో పాల్గొంటాము’’ అని నజ్రుల్‌ పేర్కొన్నాడు.

మరోవైపు.. అమినుల్‌ పాకిస్తాన్‌ పేరును ప్రస్తావిస్తూ తమకు కూడా అలాంటి వెసలుబాటు కావాలని డిమాండ్‌ చేశాడు. ‘‘చాంపియన్స్‌ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లలేదు. అలాగే గత వరల్డ్‌కప్‌ ఆడేందుకు పాకిస్తాన్‌ భారత్‌కు రాలేదు.

పాకిస్తాన్‌ మాదిరే మేము కూడా
కాబట్టి మా విషయంలోనూ పాక్‌ మాదిరే ఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. ప్రపంచకప్‌ టోర్నీల్లో హైబ్రిడ్‌ మోడల్‌ కొనసాగుతున్న విషయం అందరికీ తెలుసు. ఇందుకు భద్రతే ప్రధాన కారణం. కాబట్టి మాకు సానుకూల స్పందన లభిస్తుందని ఆశిస్తున్నాం’’ అని అమినుల్‌ అన్నాడు.

కాగా బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై హత్యాకాండ నేపథ్యంలో.. ఐపీఎల్‌ నుంచి ఆ దేశ ఆటగాళ్లను బహిష్కరించాలనే డిమాండ్లు పెరిగాయి. అందుకు అనుగుణంగానే బీసీసీఐ.. ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు నుంచి తొలగించేలా ఆదేశాలు ఇచ్చింది.

ఐసీసీ తిరస్కరించే అవకాశం?
ఈ క్రమంలో భద్రత అనే కారణం చూపుతూ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ కోసం తాము భారత్‌కు రాలేమని బంగ్లాదేశ్‌ పేర్కొంది. అయితే, టోర్నీ ఆరంభానికి నెలరోజుల సమయమే ఉన్నందున ఈ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించే అవకాశం ఉంది. 

బంగ్లాదేశ్‌ కోరినట్లు శ్రీలంకలో వారి మ్యాచ్‌లు నిర్వహించడం కుదరకపోవచ్చు. ఈ నేపథ్యంలో తొలుత తాము టోర్నీ నుంచి తప్పుకొంటామని బెదిరింపు ధోరణి కనబరిచిన బంగ్లా.. తాజాగా ఇలా మాట్లాడటం గమనార్హం.

చదవండి: IND vs NZ: టీమిండియాకు శుభవార్త

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)