'వారిద్దరూ అద్భుతం.. కచ్చితంగా వరల్డ్‌ క్రికెట్‌ను ఏలుతారు'

Published on Mon, 02/05/2024 - 09:01

వైజాగ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఆటగాళ్లు యశస్వీ జైశ్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌ అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో జైశ్వాల్‌(209) విరోచిత డబుల్‌ సెంచరీతో చెలరేగగా.. రెండో ఇన్నింగ్స్‌లో గిల్‌(104) సైతం శతకంతో మెరిశాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించారు. భవిష్యత్తులో యశస్వీ, శబ్‌మన్‌ ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తారని సెహ్వాగ్ జోస్యం చెప్పాడు.

"అతి చిన్న వయస్సులోనే గిల్‌, జైశ్వాల్‌ అసాధారణమైన ప్రతిభను కనబరుస్తున్నారు. వారు ఆటతీరును చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం వారి స్పెషల్‌. వీరిద్దరూ రాబోయే రోజుల్లో కచ్చితంగా వరల్డ్‌ క్రికెట్‌ను ఏలుతారు" అని ఎక్స్‌(ట్విటర్‌)లో సెహ్వాగ్ రాసుకొచ్చాడు. ఇక రెండో టెస్టు రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించాలంటే ఇంకా 9 వికెట్లు పడగొట్టాలి. 

399 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. మూడో రోజు ఆట ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 67 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ మరో విజయాన్ని తమఖాతాలో వేసుకోవాలంటే 332 పరుగులు చేయాల్సింది.

ఒకవేళ ఇంగ్లండ్‌ ఈ లక్ష్యాన్ని ఛేదిస్తే భారత్‌ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఎందుకంటే భారత గడ్డపై టెస్టు క్రికెట్‌లో ఈ జట్టు కూడా ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించలేదు. భారత్‌లో ఓ జట్టు ఛేదించిన అత్యధిక లక్ష్యం 387గా ఉంది. 2008లో చెన్నైలో ఇంగ్లాండ్‌పై భారత్‌ ఈ ఛేదన చేసింది.
చదవండి: NZ vs SA: రచిన్‌ రవీంద్ర విధ్వంసం.. ఏకంగా డబుల్‌ సెంచరీతో

Videos

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)