Breaking News

భారత కెప్టెన్ ఒక సూపర్ స్టార్‌.. కానీ అత‌డిని మిస్ అవుతారు: ఓలీ పోప్‌

Published on Wed, 06/11/2025 - 18:47

టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ ఓలీ పోప్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఈ సిరీస్‌లో మైదానంలో ఎంతో యాక్టివ్‌గా ఉండే విరాట్ కోహ్లి సేవ‌ల‌ను భార‌త్ మిస్ అవుతుంద‌ని పోప్‌ అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా ప్ర‌స్తుత భార‌త జ‌ట్టులో యంగ్ టాలెంటెడ్ ఆటగాళ్లు ఉన్నార‌ని అత‌డు కొనియాడాడు.

ఇంగ్లండ్ టూర్‌కు ముందు కోహ్లి టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్‌కు వ‌ర‌కైనా కొన‌సాగాల‌ని విరాట్‌ను సెల‌క్ట‌ర్లు కోరిన‌ప్ప‌టికి అత‌డు మాత్రం త‌న మ‌న‌సును మ‌ర్చుకోలేదు. అత‌డితో పాటు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కూడా రెడ్ బాల్ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికి షాకిచ్చాడు. 

దీంతో టీమిండియా టెస్టు జ‌ట్టు కొత్త కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్ నియ‌మితుడ‌య్యాడు. అదేవిధంగా సాయిసుద‌ర్శ‌న్‌, అర్ష్‌దీప్ సింగ్ వంటి యువ ఆట‌గాళ్లు తొలిసారి భార‌త టెస్టు జ‌ట్టులోకి చోటు ద‌క్క‌గా.. క‌రుణ్ నాయ‌ర్ ఎనిమిదేళ్ల తర్వాత పున‌రాగ‌మ‌నం చేశాడు. ఇప్ప‌టికే ఇంగ్లండ్‌పై గ‌డ్డ‌పై అడుగు పెట్టిన భార‌త జ‌ట్టు.. ప్రాక్టీస్‌లో మునిగితేలుతోంది. ఇంగ్లండ్ వంటి క‌ఠిన ప‌రిస్థితుల్లో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిలోని యంగ్ టీమిండియా ఎలా రాణిస్తుందో అంద‌రూ ఆతృతగా ఎదురు చూస్తోంది.

ఈ నేపథ్యంలో ఓలీ పోప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ఇది యువ భారత జట్టు. కానీ ఈ జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. చాలా మందికి కౌంటీల్లో ఆడిన అనుభవం కూడా ఉంది. అదేవిధంగా కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ టాలెంట్ కోసం మనందరికీ తెలుసు.

అతడొక సూపర్ స్టార్‌. అయితే స్లిప్‌లో నిలబడి ప్రత్యర్ధి బ్యాటర్లను ఏకగ్రాతను కోల్పోయేలా చేసే విరాట్ కోహ్లి సేవలను మాత్రం భారత్ కోల్పోతుంది. అయినప్పటికీ భారత జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉంది. వారిని ఎదుర్కొనేందుకు మా ఆటగాళ్లు కూడా సిద్దంగా ఉన్నారు అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ సిరీస్‌లో తొలి టెస్టు జూన్‌ 20 నుంచి 24 వరకు లీడ్స్‌ వేదికగా జరగనుంది.
చదవండి: IND vs ENG: టీమిండియాతో తొలి టెస్టు.. ఇంగ్లండ్ జ‌ట్టులోకి 19 ఏళ్ల యువ సంచ‌ల‌నం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)