విరాట్‌ కోహ్లి అనూహ్య నిర్ణయం!

Published on Mon, 01/05/2026 - 18:19

టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి అభిమానులకు చేదు వార్త. న్యూజిలాండ్‌తో వన్డేలకు ముందు ఈ రన్‌మెషీన్‌ మరోసారి బరిలోకి దిగుతాడనుకుంటే.. ఊహించని రీతిలో తన నిర్ణయం మార్చుకున్నాడు. ఢిల్లీ తరఫున విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో మూడో మ్యాచ్‌ ఆడేందుకు కోహ్లి నిరాకరించినట్లు తెలుస్తోంది.

బీసీసీఐ ఆదేశాల మేరకు
అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన కోహ్లి (Virat Kohli).. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్‌-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ ఢిల్లీ లెజెండ్‌.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే బరిలో దిగాడు.

రెండు మ్యాచ్‌లు కంప్లీట్‌
కనీసం రెండు మ్యాచ్‌లు అయినా ఆడాలన్న నిబంధనల మేరకు.. తాజా ఎడిషన్‌లో ఢిల్లీ తరఫున రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో స్వదేశంలో వరుస శతకాలతో జోరు మీదున్న కోహ్లి.. దేశీ క్రికెట్‌లోనూ ఫామ్‌ను కొనసాగించాడు. ఆంధ్రపై 131, గుజరాత్‌పై 77 పరుగులు సాధించాడు.

మూడోదీ ఆడతానని చెప్పి..
ఇక న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జనవరి 11 నుంచి వన్డే సిరీస్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో.. విజయ్‌ హజారే టోర్నీలో మూడో మ్యాచ్‌కు కూడా కోహ్లి అందుబాటులో ఉంటానని చెప్పాడు. ఈ విషయాన్ని ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రోహన్‌ జైట్లీ ఇటీవలే ధ్రువీకరించాడు.

అందుబాటులో లేడు
అయితే, తాజాగా ఢిల్లీ కోచ్‌ సరణ్‌దీప్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘లేదు. కోహ్లి అందుబాటులో ఉండటం లేదు’’ అని స్పష్టం చేశాడు. కాగా ఢిల్లీ తదుపరి మంగళవారం (జనవరి 6) నాటి మ్యాచ్‌లో రైల్వేస్‌ జట్టుతో ఆడనుంది. కర్ణాటకలోని ఆలూర్‌లో గల కేఎస్‌సీఏ క్రికెట్‌ గ్రౌండ్‌-2 ఇందుకు వేదిక. రిషభ్‌ పంత్‌ సారథ్యంలోని ఈ జట్టులో కోహ్లి లేడు.

చదవండి: కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)