శతక్కొట్టిన విరాట్‌ కోహ్లి

Published on Wed, 12/24/2025 - 15:36

భారత బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఈ కుడిచేతి వాటం ఆటగాడు వరుస శతకాలతో అలరించిన విషయం తెలిసిందే. ప్రొటిస్‌ జట్టుతో తొలి రెండు వన్డేల్లో సెంచరీలు చేసిన విరాట్‌.. మూడో వన్డేలో అజేయ అర్ధ శతకం (45 బంతుల్లో 65) సాధించాడు.

ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్‌ కోహ్లి (Virat Kohli)... వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో బీసీసీఐ ఆదేశాల మేరకు దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత దేశవాళీ క్రికెట్‌ బరిలో దిగాడు. సొంత జట్టు ఢిల్లీ తరఫున దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమయ్యాడు.

298 పరుగులు
ఇందులో భాగంగా బుధవారం నాటి తొలి మ్యాచ్‌లో ఆంధ్రతో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్‌ చేసింది. ఆంధ్ర బ్యాటర్లలో రిక్కీ భుయ్‌ (122) సెంచరీ చేయగా.. షేక్‌ రషీద్‌ 31, కెప్టెన్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి 23, హేమంత్‌ రెడ్డి 27, సింగుపురం ప్రసాద్‌ 28 పరుగులతో రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆంధ్ర ఎనిమిది వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.

శతక్కొట్టిన విరాట్‌ కోహ్లి
ఢిల్లీ బౌలర్లలో సిమర్‌జీత్‌ సింగ్‌ ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రిన్స్‌ యాదవ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీకి ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ అర్పిత్‌ రాణా డకౌట్‌ అయ్యాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్‌ ప్రియాన్ష్‌ ఆర్య అర్ధ శతకం (74) బాదగా.. అతడికి తోడుగా వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లి సెంచరీ చేశాడు. కేవలం 83 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు.

మొత్తంగా 101 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 14 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 131 పరుగులు చేశాడు. రాజు బౌలింగ్‌లో షేక్‌ రషీద్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో కోహ్లి శతక ఇన్నింగ్స్‌కు తెరపడింది.

చదవండి: తిరుగులేని ఇషాన్‌ కిషన్‌.. వైభవ్‌ రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)