జైసూ జస్ట్‌ మిస్‌.. సర్ఫరాజ్‌ విధ్వంసకర, భారీ శతకం

Published on Wed, 12/31/2025 - 12:58

టీమిండియా స్టార్‌ యశస్వి జైస్వాల్‌ తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. అనారోగ్యం నుంచి కోలుకున్న జైసూ.. సొంత జట్టు ముంబై తరఫున దేశీ క్రికెట్‌ బరిలో దిగాడు. విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే టోర్నీ 2025-26లో భాగంగా గోవాతో మ్యాచ్‌ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు.

జైపూర్‌ వేదికగా గోవాతో మ్యాచ్‌లో టాస్‌ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో ఓపెనర్లలో అంగ్‌క్రిష్‌ రఘువన్షి (11) త్వరగానే పెవిలియన్‌ చేరగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ముషీర్‌ ఖాన్‌తో కలిసి యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) నిలకడగా ఆడాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించారు.

జైసూ జస్ట్‌ మిస్‌.. 
అయితే, అర్ధ శతకానికి నాలుగు పరుగుల దూరంలో ఉన్న వేళ.. జైసూ దర్శన్‌ మిసాల్‌ (Darshan Misal) బౌలింగ్‌లో స్నేహల్‌ కౌతంకర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. గోవాతో మ్యాచ్‌లో మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్‌.. ఆరు ఫోర్ల సాయంతో 46 పరుగులు చేశాడు. మరోవైపు.. ముషీర్‌ ఖాన్‌కు తోడైన.. అతడి అన్న, టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ దుమ్ములేపాడు.

సర్ఫరాజ్‌ విధ్వంసకర, భారీ శతకం
తమ్ముడు ముషీర్‌ (60)తో కలిసి మూడో వికెట్‌కు 93 పరుగులు జోడించిన సర్ఫరాజ్‌ ఖాన్‌.. విధ్వంసకర శతకంతో చెలరేగాడు. కేవలం 56 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు.

మొత్తంగా 75 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్సర్లు బాదిన సర్ఫరాజ్‌ ఖాన్‌.. 157 పరుగులు చేసి దర్శన్‌ మిసాల్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మిగిలిన వారిలో హార్దిక్‌ తామోర్‌ హాఫ్‌ సెంచరీ (28 బంతుల్లో 53)తో మెరవగా.. కెప్టెన్‌ శార్దూల్‌ ఠాకూర్‌ (8 బంతుల్లో 27) మెరుపులు మెరిపించాడు.

ముంబై భారీ స్కోరు
ఇక సిద్దేశ్‌ లాడ్‌ 17, షామ్స్‌ ములాని 22 పరుగులు చేయగా.. ఆఖర్లో తనుశ్‌ కొటియాన్‌ (12 బంతుల్లో 23), తుషార్‌ దేశ్‌పాండే (3 బంతుల్లో 7) ధనాధన్‌ దంచికొట్టి అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ముంబై ఎనిమిది వికెట్ల నష్టానికి 444 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. గోవా బౌలర్లలో దర్శన్‌ మిసాల్‌ మూడు వికెట్లు కూల్చగా.. వాసుకి కౌశిక్‌, లలిత్‌ యాదవ్‌ చెరో రెండు, దీప్‌రాజ్‌ గవోంకర్‌ ఒక వికెట్‌ కూల్చారు. 

చదవండి: బీసీసీఐ యూటర్న్‌!.. షమీకి గోల్డెన్‌ ఛాన్స్‌!

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)