రింకూ విఫలం.. సెమీస్‌ బెర్తులు ఖరారు చేసుకున్న జట్లు ఇవే

Published on Tue, 01/13/2026 - 09:27

దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో సౌరాష్ట్ర సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఉత్తరప్రదేశ్‌ జట్టుతో జరిగిన రెండో క్వార్టర్‌ ఫైనల్లో వీజేడీ పద్ధతిలో 17 పరుగుల తేడాతో గెలిచి సెమీస్‌ ఖరారు చేసుకుంది. 

రింకూ విఫలం
బెంగళూరు వేదికగా ముందుగా ఉత్తరప్రదేశ్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 310 పరుగులు చేసింది. అభిషేక్‌ గోస్వామి (82 బంతుల్లో 88; 12 ఫోర్లు), సమీర్‌ రిజ్వీ (77 బంతుల్లో 88 నాటౌట్‌; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు. కెప్టెన్‌ రింకూ సింగ్‌ (20 బంతుల్లో 13)మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు.

హార్విక్‌ దేశాయ్‌ సెంచరీతో
సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్‌ సకారియా 3 వికెట్లు... అంకుర్‌ పన్వర్, ప్రేరక్‌ మన్కడ్‌ 2 వికెట్లు తీశారు. 311 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర 40.1 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు సాధించింది. ఓపెనర్‌ హార్విక్‌ దేశాయ్‌ (116 బంతుల్లో 100 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేశాడు.

ప్రేరక్‌ మన్కడ్‌ (66 బంతుల్లో 67; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. చిరాగ్‌ జానీ (31 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. సౌరాష్ట్ర స్కోరు 238/3 వద్ద భారీ వర్షం రావడం, ఆ తర్వాత తగ్గకపోవడంతో వీజేడీ పద్ధతిని అనుసరించి విజేతను నిర్ణయించారు. ఆట నిలిచిపోయే సమయానికి సౌరాష్ట్ర విజయసమీకరణం కంటే 17 పరుగులు ముందంజలో ఉండటంతో ఆ జట్టుకు విజయం దక్కింది.

పడిక్కల్‌ జోరు.. కర్ణాటక నాలుగోసారి
డిఫెండింగ్‌ చాంపియన్‌ కర్ణాటక జట్టు వరుసగా నాలుగోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బెంగళూరులో ముంబై జట్టుతో సోమవారం జరిగిన తొలి క్వార్టర్‌ ఫైనల్లో కర్ణాటక జట్టు వీజేడీ పద్ధతిలో 54 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 254 పరుగులు సాధించింది. షమ్స్‌ ములానీ (91 బంతుల్లో 86; 8 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

కెప్టెన్‌ సిద్దేశ్‌ లాడ్‌ (58 బంతుల్లో 38; 4 ఫోర్లు), సాయిరాజ్‌ పాటిల్‌ (25 బంతుల్లో 33 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. ముంబై స్టార్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. 

కర్ణాటక బౌలర్లలో విద్యాధర్‌ పాటిల్‌ (3/42), అభిలాశ్‌ శెట్టి (2/59), విద్వత్‌ కావేరప్ప (2/43) రాణించారు. అనంతరం 255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక 33 ఓవర్లలో 1 వికెట్‌ కోల్పోయి 187 పరుగులు చేసింది.

కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (12) తక్కువ స్కోరుకే అవుటవ్వగా... దేవ్‌దత్‌ పడిక్కల్‌ (95 బంతుల్లో 81 నాటౌట్‌; 11 ఫోర్లు), కరుణ్‌ నాయర్‌ (80 బంతుల్లో 74 నాటౌట్‌; 11 ఫోర్లు) రెండో వికెట్‌కు 143 పరుగులు జోడించారు. కర్ణాటక విజయం దిశగా సాగుతున్న దశలో భారీ వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. 

వర్షం తగ్గకపోవడంతో వీజేడీ పద్ధతిని అనుసరించి విజేతను నిర్ణయించారు. వీజేడీ పద్ధతి ప్రకారం 33 ఓవర్లకు కర్ణాటక విజయసమీకరణం 132 పరుగులు. కర్ణాటక 55 పరుగులు ముందుండటంతో ఆ జట్టును గెలుపు వరించింది.

చదవండి: భారత్‌పై నిందలు!.. బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ! 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)