Breaking News

ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్‌.. సీఎస్‌కే కెప్టెన్‌ రియాక్షన్‌ వైరల్‌

Published on Wed, 05/21/2025 - 08:36

రాజస్తాన్‌ రాయల్స్‌ యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఆటలోనే కాదు.. పెద్దలను గౌరవించడంలోనూ ముందే ఉంటానని నిరూపించాడు. ఐపీఎల్‌-2025లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK vs RR)తో మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు.. దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni) పాదాలకు నమస్కరించడం ఇందుకు నిదర్శనం. కాగా ఈ సీజన్‌లో తమ ఆఖరి మ్యాచ్‌లో భాగంగా రాజస్తాన్‌ సీఎస్‌కేతో మంగళవారం తలపడింది.

ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరిగిన పోరులో రాయల్స్‌ ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై గెలుపొంది.. విజయంతో ముగించింది. మరోవైపు.. ధోని జట్టుకిది పదో పరాజయం కావడం గమనార్హం. టాస్‌ ఓడిన చెన్నై మొదట నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

ఆయుశ్‌ మాత్రే (20 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్‌), బ్రెవిస్‌ (25 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఆకాశ్‌ మధ్వాల్, యుద్‌వీర్‌ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత రాజస్తాన్‌ 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసి గెలిచింది. 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ (33 బంతుల్లో 57; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మరోసారి మెరిపించాడు. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (31 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడాడు.  

ఆరంభంలో కుదేలైనా... 
చెన్నై ఆరంభంలోనే కాన్వే (10), ఉర్విల్‌ పటేల్‌ (0) వికెట్లను కోల్పోయింది. మరో ఓపెనర్‌ ఆయుశ్‌ మాత్రే బౌండరీలతో అలరించాడు. పవర్‌ప్లేలో  జట్టు పుంజుకుంటున్న తరుణంలో... ఆయుశ్‌ దూకుడుకు తుషార్‌ చెక్‌ పెట్టాడు. స్వల్ప వ్యవధిలో అశ్విన్‌ (13), జడేజా (1) వికెట్లను కోల్పోయిన చెన్నై 78/5 స్కోరు వద్ద కష్టాల్లో పడింది. ఈ దశలో బ్రెవిస్, శివమ్‌ దూబే (32 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.

వైభవ్‌ ధనాధన్‌
లక్ష్య ఛేదనలో మొదట యశస్వి జైస్వాల్‌ (19 బంతుల్లో 36; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే దంచేశాడు. అతను అవుటైనప్పడు జట్టు స్కోరు 37/1. అందులో 36 జైస్వాల్‌వే! శాంసన్‌ వచ్చాకే వైభవ్‌ బ్యాట్‌కు పనిచెప్పాడు. భారీ సిక్సర్లతో విరుచుకు పడి 27 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 

అయితే  అశ్విన్‌ ఒకే ఓవర్లో శాంసన్‌, వైభవ్‌లను అవుట్‌ చేశాడు. పరాగ్‌ (3)ను నూర్‌ అహ్మద్‌ బౌల్తా కొట్టించాడు. అయితే చెన్నై పట్టుబిగించకుండా జురేల్‌ (12 బంతుల్లో 31 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేయడంతో ఇంకా 2.5 ఓవర్లు మిగిలుండగానే రాజస్తాన్‌ గెలిచింది.  

మిస్టర్‌ కూల్‌ రియాక్షన్‌ ఇదీ
ఇక మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఆనవాయితీ ప్రకారం చెన్నై- రాజస్తాన్‌ ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకున్నారు. అయితే, వైభవ్‌ మాత్రం ఇందుకు భిన్నంగా.. చెన్నై సారథి ధోని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. మిస్టర్‌ కూల్‌ కూడా వైభవ్‌ వెన్నుతట్టి బాగా ఆడావు అన్నట్లుగా ప్రశంసించాడు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఐపీఎల్‌-2025లో రాజస్తాన్‌ రాయల్స్‌కు చేదు అనుభవాలే మిగిలినా.. వైభవ్‌ రూపంలో ప్రతిభ గల ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. ఆడిన ఏడు ఇన్నింగ్స్‌లో ఓ సెంచరీ సాయంతో ఈ హర్యానా కుర్రాడు 252 పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో పద్నాలుగు మ్యాచ్‌లలో రాజస్తాన్‌ కేవలం నాలుగు మాత్రమే గెలిచింది.

చదవండి: IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు.. ల‌క్నో వేదిక‌గా ఆర్సీబీ మ్యాచ్‌లు
 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)