Breaking News

వైభవ్‌ సూర్యవంశీ ఫెయిల్‌

Published on Mon, 01/12/2026 - 16:53

ఇంగ్లండ్‌ అండర్‌-19 జట్టుతో మ్యాచ్‌లో భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ దారుణంగా విఫలమయ్యాడు. పట్టుమని పది పరుగులు కూడా చేయలేక చతికిలపడ్డాడు. ఇటీవల సౌతాఫ్రికా గడ్డపై వైభవ్‌ పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే.

భారత్‌ అండర్‌-19 జట్టు కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అదరగొట్టి.. సౌతాఫ్రికాతో మూడు యూత్‌ వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేశాడు వైభవ్‌. అండర్‌-19 వరల్డ్‌కప్‌-2026 టోర్నీకి ముందు అతడు ఫామ్‌లోకి రావడంతో భారత శిబిరంలో ఆత్మవిశ్వాసం పెరిగింది.

స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లోనూ అదరగొట్టి
అదే జోరును కొనసాగిస్తూ స్కాట్లాండ్‌తో అండర్‌-19 వరల్డ్‌కప్‌-2026 వార్మప్‌ మ్యాచ్‌లోనూ వైభవ్‌ సూర్యవంశీ అదరగొట్టాడు. జింబాబ్వే వేదికగా.. స్కాట్లాండ్‌ జట్టుపై ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ 50 బంతుల్లోనే 96 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో డీఎల్‌ఎస్‌ పద్ధతి ప్రకారం భారత్‌.. పసికూన స్కాట్లాండ్‌పై 121 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

ఒకే ఒక్క పరుగు
జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వైభవ్‌ సూర్యవంశీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. అయితే, జింబాబ్వేలో ఇంగ్లండ్‌ అండర్‌-19 జట్టుతో సోమవారం నాటి వార్మప్‌ మ్యాచ్‌లో మాత్రం వైభవ్‌ పూర్తిగా నిరాశపరిచాడు. కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (49)తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన ఈ పద్నాలుగేళ్ల చిచ్చర పిడుగు.. నాలుగు బంతులు ఎదుర్కొని  కేవలం ఒకే ఒక్క పరుగు చేశాడు.

ఇంగ్లిష్‌ పేసర్‌ సెబాస్టియన్‌ మోర్గాన్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడే క్రమంలో థామస్‌ ర్యూకి క్యాచ్‌ ఇచ్చి వైభవ్‌ పెవిలియన్‌ చేరాడు. పసికూన స్కాట్లాండ్‌పై చితక్కొట్టిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. తాజాగా పటిష్ట ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తేలిపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. 

భారత్‌ మెరుగైన స్కోరు
ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 295 పరుగులు సాధించింది. వైభవ్‌తో పాటు వేదాంత్‌ త్రివేది (14), విహాన్‌ మల్హోత్రా (10) విఫలమైనా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అభిజ్ఞాన్‌ కుందు బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాడు. 99 బంతుల్లో 82 పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు.

మిగిలిన వారిలో ఆర్‌ఎస్‌ అంబరీశ్‌ 48, కనిష్క్‌ చౌహాన్‌ 45 (నాటౌట్‌) రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జేమ్స్‌ మింటో ఐదు వికెట్లతో చెలరేగగా.. సెబాస్టియన్‌ మోర్గాన్‌ రెండు, మ్యానీ లమ్స్‌డన్‌ ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా జింబాబ్వే వేదికగా జనవరి 15 నుంచి అండర్‌-19 వరల్డ్‌కప్‌ మొదలుకానుంది.

చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్‌.. జట్టులోకి ఊహించని ఆటగాడు

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)