Breaking News

కవ్వించి తప్పు చేశారు.. వైభవ్ ప్రతీకారం!

Published on Sun, 06/21/2026 - 11:54

ముక్కోణపు వన్డే టోర్నీలో భాగంగా భారత సంచలనం వైభవ్ సూర్యవంశీ తనకు కోపమొస్తే ఆ విధ్వంసం ఎంతలా ఉంటుందో లంక ఆటగాళ్లకు రుచి చూపించాడు. మొన్నటికి మొన్న లంక-ఏ ఆటగాళ్లతో గొడవకు దిగి వైభవ్ సూర్యవంశీ విమర్శలకు గురయ్యాడు. బ్యాటింగ్‌లో విఫలం కావడానికి తోడు తన చర్యతో చెడ్డ పేరు మూటగట్టుకున్నాడు. 

అయితే తనపై వచ్చిన విమర్శలకు, అనవసరంగా గెలికిన లంక ఆటగాళ్లకు ఒక్క ఇన్నింగ్స్‌తో దిమ్మతిరిగిపోయే సమాధానమిచ్చాడు. ఎందుకురా అన‌స‌వ‌రంగా పెట్టుకున్నాం వీడితో అనేంత‌లా వైభ‌వ్ రెచ్చిపోయాడు. క్రీజులోకి దిగిందే మొద‌లు బాద‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా పెట్టుకున్న వైభ‌వ్ తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండ‌రీగా మ‌ల‌చిన వైభ‌వ్ 28 బంతుల వ‌ర‌కు విధ్వంసాన్ని కొన‌సాగించాడు. 

ఇక తొలి 11 బంతుల్లో వైభవ్ వరుసగా 4,4,4,6,6,0,6,4,4,6,6 బాదడం విశేషం. తాను ఎదుర్కొన్న 11 బంతుల్లో ఒక డాట్ బాల్ మినహా మిగతా అన్ని బంతులను గ‌మ‌నిస్తే ఫోర్లు, సిక్సర్లే కనిపిస్తాయి. దీన్నిబట్టే వైభవ్ విధ్వంసం ఎలా సాగిందనేది అర్ధం చేసుకోవచ్చు. ఈ నేప‌థ్యంలోనే లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును త‌న పేరిట లిఖించుకున్న వైభ‌వ్ ఆ త‌ర్వాత సెంచ‌రీ వైపు ప‌రిగెత్తాడు. 

చూస్తుండ‌గానే 90ల్లోకి వ‌చ్చిన వైభ‌వ్ 29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స‌ర్ల సాయంతో 94 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. వైభ‌వ్ కాస్త కొంచెం ఓపిక వ‌హించి ఉండుంటే లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ రికార్డు కూడా త‌న పేరిట లిఖించుకునేవాడు. అయితే తృటిలో శ‌త‌కం చేజార్చుకున్న‌ప్ప‌టికీ వైభ‌వ్ ఆడిన 94 ప‌రుగుల ఇన్నింగ్స్‌ త‌న కెరీర్‌లోనే కాదు ప్ర‌పంచ క్రికెట్‌లో సైతం ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంద‌న‌డంలో సందేహం లేదు. 

అయితే అండ‌ర్‌-19 క్రికెట్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ 52 బంతుల్లో సెంచ‌రీ బాదిన సంగ‌తి తెలిసిందే. ఇక లిస్ట్‌-ఏ క్రికెట్‌లో మాత్రం ఆస్ట్రేలియా క్రికెట‌ర్ జేమ్స్ మెక్‌గుర్క్ 29 బంతుల్లో సెంచ‌రీ సాధించ‌డం ఇప్ప‌టికీ ప్ర‌పంచ రికార్డుగా ఉంది. అంత‌ర్జాతీయ వ‌న్డే క్రికెట్‌లో ఏబీ డివిలియ‌ర్స్ 31 బంతుల్లో అందుకున్న రికార్డు శ‌త‌కం ఇప్ప‌టికీ చెక్కుచెద‌ర‌లేదు. ఇక దేశ‌వాలీ క్రికెట్‌లో 2025-26 విజ‌య్ హ‌జారే ట్రోఫీలో అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌పై 36 బంతుల్లోనే సెంచ‌రీ బాదిన వైభ‌వ్ లిస్ట్‌-ఏ క్రికెట్‌లో శ‌త‌క్కొట్టిన‌ అత్యంత పిన్న వ‌య‌స్కుడిగా వైభ‌వ్ రికార్డుల‌కెక్కాడు. 

మొత్తం మీద తృటిలో ఫాస్టెస్ట్ సెంచ‌రీ రికార్డు మిస్‌చేసుకున్న వైభ‌వ్ త‌న‌ను అన‌వ‌స‌రంగా గెలికి తప్పు చేసిన లంక ఆట‌గాళ్ల‌కు బ్యాటింగ్ ప‌వ‌ర్ రుచి చూపించ‌డంతో పాటు ప్ర‌తీకారం తీర్చుకున్నాడు. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే 25 ఓవర్లు ముగిసేసరికి ఇండియా-ఏ 2 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ (40), రుతురాజ్ గైక్వాడ్ (31 పరుగులు) క్రీజులో ఉన్నారు.

 

Read: వైభవ్‌ సూర్యవంశీ ప్రపంచ రికార్డు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)