T20 WC 2026: ‘ఫైనల్లో టీమిండియాపై గెలుస్తాం’

Published on Sat, 01/10/2026 - 13:03

డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు శ్రీలంకతో కలిసి ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్‌ సిద్ధమైంది. ఈ ఐసీసీ ఈవెంట్‌ను ఫిబ్రవరి 7 -మార్చి 8 మధ్య నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది.

ఈసారి కూడా టీమిండియా హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. సొంతగడ్డపై టోర్నీ జరుగనుండటం భారత జట్టుకు మరో సానుకూలాంశం. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

వరల్డ్‌కప్‌ ఫైనల్లో గెలుస్తాం
ఐడెన్‌ మార్క్రమ్‌ కెప్టెన్సీలోని సౌతాఫ్రికా ఈసారి తప్పకుండా చాంపియన్‌గా అవతరిస్తుందని అంచనా వేశాడు. వరల్డ్‌కప్‌ ఫైనల్లో సూర్యకుమార్‌ సేనను ఓడించి ఈసారి ట్రోఫీని ముద్దాడుతుందని గ్రేమ్‌ స్మిత్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఇటీవల టెస్టు సిరీస్‌లో సౌతాఫ్రికా టీమిండియాను 2-0తో వైట్‌వాష్‌ చేయడాన్ని ప్రస్తావించాడు.

‘‘భారత్‌లో ఆ టెస్టు సిరీస్‌ అద్భుతం. టీమిండియాను సొంతగడ్డపై ఓడించి.. మా జట్టు పూర్తి ఆధిపత్యం కొనసాగించడం నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది. గత ఏడాదిన్నరకాలంగా మా టెస్టు జట్టు అద్భుతంగా ఆడుతోంది.

సౌతాఫ్రికా క్రికెట్‌ను సరికొత్తగా మార్చింది. ఇక ఈసారి భారత్‌లో జరిగే వరల్డ్‌కప్‌ ఫైనల్లోనూ టీమిండియాను ఓడించి మేము టైటిల్‌ గెలుస్తాం’’ అని గ్రేమ్‌ స్మిత్‌ పీటీఐతో పేర్కొన్నాడు.

మార్పు అవశ్యం
అదే విధంగా.. ‘‘ఈసారి కూడా టీమిండియా పటిష్టంగా కనిపిస్తోంది. వారి గెలుపు అవకాశాలను కొట్టివేయలేము. పైగా స్వదేశంలో టోర్నీ జరుగడం వారికి అదనపు బలం.

ముఖ్యంగా సీనియర్ల నిష్క్రమణ (రోహిత్‌ శర్మ- విరాట్‌ కోహ్లి), హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌ రావడం వంటి పరిణామాలతో భారత క్రికెట్‌లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పును కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

టీమిండియాదే పైచేయి
ఏదేమైనా ఈసారి టీమిండియా గనుక సెమీ ఫైనల్‌కు చేరకపోతే అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం మరొకటి ఉండదు’’ అని గ్రేమ్‌ స్మిత్‌ అన్నాడు. కాగా రోహిత్‌ శర్మ సారథ్యంలో టీ20 ప్రపంచకప్‌-2024 ఫైనల్లో భారత్‌.. సౌతాఫ్రికాను ఓడించి టైటిల్‌ గెలుచుకుంది.

బార్బడోస్‌ వేదికగా ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో సఫారీ జట్టుపై ఏడు పరుగుల తేడాతో గెలిచి.. తన ఖాతాలో రెండో టీ20 ట్రోఫీని జమచేసుకుంది. ఇక ఈ టోర్నీ తర్వాత రోహిత్‌ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ పగ్గాలు చేపట్టాడు.

గత పద్దెనిమిది నెలల కాలంలో సూర్య సారథ్యంలో ఆడిన టీమిండియా కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఓడిపోవడం.. జట్టు ఏ మేర పటిష్టంగా ఉందో చెప్పేందుకు నిదర్శనం. చివరగా ఇటీవల సొంతగడ్డపై సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-1తో గెలిచింది. మరోవైపు.. సౌతాఫ్రికాకు మాత్రం గతేడాది అంత గొప్పగా ఏమీ సాగలేదు. 

చదవండి: మేము నటిస్తున్నామని మాకూ తెలుసు: బీసీబీపై బంగ్లా కెప్టెన్‌ విమర్శలు

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)