Breaking News

Under 19 World Cup 2026: భారత్‌ శుభారంభం

Published on Thu, 01/15/2026 - 20:14

ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ 2026లో భారత్ శుభారంభం చేసింది. గురువారం బులవాయో వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో యువ భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టింది.

తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా భారత బౌలర్లు చెలరేగడంతో 35.2 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 107 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. పేసర్ హేనిల్ పటేల్ అద్భుతమైన ప్రదర్శనతో ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. హెనిల్ 7 ఓవ‌ర్లు బౌలింగ్ చేసి కేవ‌లం 16 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

అతడితో పాటు దీపేష్‌, అబ్రిష్‌, ఖిలాన్‌ పటేల్‌, వైభవ్‌ సూర్యవంశీ తలా వికెట్‌ సాధించారు. అమెరికా బ్యాటర్లలో నితీష్‌ సుదిని (36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో భారత్ లక్ష్యాన్ని 37 ఓవర్లలో 96 పరుగులుగా నిర్ణయించారు.

ఈ టార్గెట్‌ను భార‌త్ 17.2 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. వైభ‌వ్ సూర్య‌వంశీ(2), అయూశ్ మాత్రే(19), త్రివేది(2) నిరాశ‌ప‌రిచిన‌ప్ప‌టికి..  వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుండు (42) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అమెరికా బౌల‌ర్ల‌లో రిత్విక్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. రిషబ్ షింపి ఒక్క వికెట్ సాధించాడు. భార‌త్ త‌మ త‌దుప‌రి మ్యాచ్‌లో జ‌న‌వ‌రి 17న బంగ్లాదేశ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.
చదవండి: BCB: ఆటగాళ్ల తిరుగు బాటు..! కీలక అధికారిపై వేటు వేసిన బీసీబీ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)