Breaking News

World Cup 2026: టీమిండియా ఘన విజయం

Published on Tue, 01/27/2026 - 20:59

అండర్‌ 19 ప్రపంచకప్‌లో యువ భారత్‌ వరుస విజయాలతో దూసుకుపోతుంది. గ్రూప్‌ దశలో హ్యాట్రిక్‌ విజయాలతో సూపర్‌ సిక్స్‌కు చేరిన యంగ్‌ ఇండియా.. ఈ దశలోనూ తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది.

బులవాయో వేదికగా ఇవాళ (జనవరి 27) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 204 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్‌ ఒడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. విహాన్‌ మల్హోత్రా (109 నాటౌట్‌) సెంచరీతో సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (30 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించగా.. మరో మిడిలార్డర్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ అభిగ్యాన్‌ కుందు (62 బంతుల్లో 61; 5 ఫోర్లు, సిక్స్‌) సెంచరీ వీరుడు విహాన్‌కు సహకరించాడు. ఆఖర్లో ఖిలన్‌ పటేల్‌ (12 బంతుల్లో 30; ఫోర్‌, 3 సిక్సర్లు) బ్యాట్‌ ఝులిపించడంతో భారత్‌ 350 పరుగుల మార్కును దాటింది.

మిగతా ఆటగాళ్లలో ఆరోన్‌ జార్జ్‌ 23, కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే 21, వేదాంత్‌ త్రివేది 15, కనిష్క్‌ చౌహాన్‌ 3, అంబ్రిష్‌ 21, హెనిల్‌ పటేల్‌ 2 (నాటౌట్‌) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో టటెండ చిముగోరో 3 వికెట్లు పడగొట్టగా.. పనాషే మజాయ్‌, కెప్టెన్‌ సింబరాషే మడ్జెంగెరె తలో 2, ధృవ్‌ పటేల్‌ ఓ వికెట్‌ తీశారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే ఆదిలోనే చేతులెత్తేసింది. భారత బౌలర్లు మూకుమ్మడిగా విరుచుకుపడటంతో 37.4 ఓవర్లలో 148 పరుగులకే చాపచుట్టేసింది. లీరాయ్‌ (62), కియాన్‌ బ్లిగ్నాట్‌ (37), టటెండ చిముగోరో (29) మినహా అందరూ సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. 

భారత బౌలర్లలో ఉధవ్‌ మోహన్‌, ఆయుశ్‌ మాత్రే తలో 3 వికెట్లు పడగొట్టగా.. అంబ్రిష్‌ 2, హెనిల్‌ పటేల్‌, ఖిలన్‌ పటేల్‌ చెరో​ వికెట్‌ తీశారు. సూపర్‌ సిక్స్‌లో భారత్‌ నెక్స్ట్‌ టార్గెట్‌ దాయాది పాకిస్తాన్‌. ఈ మ్యాచ్‌ ఫిబ్రవరి 1న బులవాయో వేదికగా జరుగనుంది. 
 

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)