Breaking News

వాళ్లకి టెస్టు క్యాప్‌లు ఎలా ఇస్తారు?: భారత మాజీ క్రికెటర్‌ ఫైర్‌

Published on Sat, 11/29/2025 - 11:15

టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ స్టార్లకు టెస్టు క్యాప్‌లు ఇవ్వడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సత్తా చాటినప్పటికీ చాలా మంది ఆటగాళ్లు టెస్టుల్లో రాణించలేకపోతున్నారని విమర్శించాడు.

సౌతాఫ్రికా చేతిలో 2-0తో వైట్‌వాష్‌
వాస్తవానికి సదరు ప్లేయర్లు టెస్టులకు సిద్ధంగా లేకపోయినా.. వారిని ఆడిస్తూ జట్టు భారీ మూల్యమే చెల్లిస్తోందని ఆకాశ్‌ చోప్రా (Aakash Chopra) ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా స్వదేశంలో టీమిండియాకు టెస్టుల్లో మరో ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. గతేడాది న్యూజిలాండ్‌ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌ అయిన టీమిండియా.. ఇటీవల సౌతాఫ్రికా చేతిలో 2-0 (IND vs SA)తో చిత్తుగా ఓడింది.

ముఖ్యంగా గువాహటి వేదికగా రెండో టెస్టులో మరీ దారుణంగా ప్రొటిస్‌ జట్టు చేతిలో 408 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడింది. దీంతో టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir)తో పాటు సెలక్టర్ల విధానాలను ప్రశ్నిస్తున్న మాజీ క్రికెటర్లు.. బ్యాటర్ల వైఫల్యాన్ని తూర్పారబడుతున్నారు.

అంత మాత్రాన టెస్టు జట్టులో చోటిచ్చేస్తారా?
ఈ నేపథ్యంలో ఆకాశ్‌ చోప్రా సైతం యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘ఇటీవలి కాలంలో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆటగాళ్లలో చాలా మందికి ఎక్కువగా ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేదు.  యశస్వి జైస్వాల్‌ 15, శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) 20-22 మ్యాచ్‌లు ఆడిన తర్వాత టెస్టుల్లో అరంగేట్రం చేశారు.

సాయి సుదర్శన్‌ 29, నితీశ్‌ కుమార్‌రెడ్డి 23, ధ్రువ్‌ జురెల్‌ 15 మ్యాచ్‌లు ఆడి ఉంటారు. దేవదత్‌ పడిక్కల్‌ అందరి కంటే ఎక్కువగా 31 మ్యాచ్‌లు ఆడినా.. అతడికి రావాల్సినన్ని అవకాశాలు రావడం లేదు. ఐపీఎల్‌ లేదంటే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విజృంభించినంత మాత్రాన టెస్టు జట్టులో చోటిచ్చేస్తారా?

జైసూ, గిల్‌ వంటి ఆటగాళ్లు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అనుభవం తక్కువగా ఉన్నా టెస్టుల్లో తమను తాము ఇప్పటికే నిరూపించుకున్నారు. కానీ ప్రతి ఒక్కరు అలాగే ఆడలేరు కదా!.. ఫార్మాట్‌కు అనుగుణంగా రాణించేందుకు కొందరికి తక్కువ సమయం పడితే.. మరికొందరు ఎక్కువ సమయం తీసుకుంటారు.

అర్థం చేసుకోవాల్సింది మీరే!
ఇప్పుడు జరిగింది ఇదే. ప్రొటిస్‌తో మ్యాచ్‌లలో పరుగులు రాబట్టేందుకు వారు ఆపసోపాలు పడ్డారు. నిజానికి వాళ్లు సంప్రదాయ ఫార్మాట్‌ ఆడేందుకు సిద్ధంగా లేరు. కనీసం 3-4 సీజన్లలో వరుసగా రెడ్‌బాల్‌ క్రికెట్‌ ఆడితే వారు పూర్తి స్థాయిలో టెస్టులకు సన్నద్ధం కాగలరు. కానీ అది గుర్తించకుండా వెంటనే జాతీయ జట్టులోకి పిలిపిస్తే ఎలా?

నిజానికి ఇందులో ఆటగాళ్ల తప్పేమీ లేదు. వారు సిద్ధంగా లేరని అర్థం చేసుకోవాల్సింది మీరే!.. ఓ ఆటగాడికి టెస్టు క్యాప్‌ అందించే ముందు అతడు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో కనీసం 2-3 సీజన్లు ఆడేలా చూసుకోండి. నిలకడగా పరుగులు రాబట్టిన బ్యాటర్లు, వికెట్లు తీసిన బౌలర్లకి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వండి. ఆ తర్వాతే టెస్టుల్లో ఆడించండి. సంధి కాలంలో ఇదే సరైన విధానం అనిపించుకుంటుంది’’ అంటూ టీమిండియా మేనేజ్‌మెంట్‌కు ఆకాశ్‌ చోప్రా చురకలు అంటించాడు.

చదవండి: Ashes: ఊహించిందే జరిగింది.. ఆసీస్‌ కీలక ప్రకటన

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)