టీ20 సిరీస్‌ ఓటమి.. నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్ గోవిందా

Published on Sun, 07/12/2026 - 07:56

నాలుగు నెల‌ల కిందట జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను మూడోసారి కైవ‌సం చేసుకొని నంబ‌ర్‌వ‌న్ స్థానాన్ని అధిరోహించిన టీమిండియా తాజాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఓటమితో ఆ స్థానాన్ని కోల్పోయింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-4తో ఇంగ్లండ్‌కు అప్ప‌గించి దారుణ ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకున్న‌ భార‌త జ‌ట్టు సిరీస్‌తో పాటు నంబ‌ర్‌వ‌న్ స్థానాన్ని కూడా ఇంగ్లండ్‌కు అప్ప‌గించేసింది. 1605 రోజుల తర్వాత టీమిండియా టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానాన్ని కోల్పోవడం గమనార్హం.

పాయింట్ల ప‌రంగా మార్పు లేన‌ప్ప‌టికీ మ్యాచ్‌ల ప‌రంగా తేడా ఉండ‌డంతో ఇంగ్లండ్ తొలి స్థానాన్ని ఆక్ర‌మించింది. రెండో స్థానంలో భార‌త్ (268 పాయింట్లు), మూడో స్థానంలో ఆస్ట్రేలియా (260 పాయింట్లు) కొన‌సాగుతున్నాయి. గ‌త నాలుగేళ్ల‌లో నంబ‌ర్‌వ‌న్ ర్యాంకు కోల్పోవ‌డంతో పాటు రెండు వ‌రుస టీ20 సిరీస్‌లు ఓడ‌డం కూడా టీమిండియాకు ఇదే తొలిసారి కావ‌డం గ‌మనార్హం.  ఈ నేప‌థ్యంలోనే ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఓట‌మి ద్వారా ప‌లు చెత్త రికార్డుల‌ను కూడా భార‌త్ త‌న పేరిట లిఖించుకుంది.

👉టీమిండియాకు ప‌రుగుల ప‌రంగా (56 ప‌రుగులు) ఇది నాలుగో అతిపెద్ద ఓట‌మి. గ‌తంలో 2026లో ఇంగ్లండ్ చేతిలోనే 125 ప‌రుగుల తేడాతో ఓట‌మిపాలైంది. 2091లో న్యూజిలాండ్ చేతిలో 80 ప‌రుగులు, 2026లో సౌతాఫ్రికా చేతిలో 76 ప‌రుగుల తేడాతో ఓట‌మి చ‌విచూసింది.

👉ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా నాలుగు మ్యాచ్‌లు ఓడ‌డం ద్వారా ఒక సిరీస్‌లో అత్య‌ధిక ఓట‌ములు చ‌విచూసిన‌ట్ల‌యింది. గ‌తంలో 2009 మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్‌లో మూడు ఓట‌ములు, 2010 మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్‌లో మూడు ఓట‌ములు, 2023 వెస్టిండీస్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లో మూడు ఓట‌ములు చ‌విచూసింది.

👉కెప్టెన్‌గా తొలి ఏడు టీ20 మ్యాచ్‌ల్లో గెలుపు లేని ఆట‌గాళ్ల జాబితాలో శ్రేయ‌స్ అయ్య‌ర్ చోటు సంపాదించాడు. గ‌తంలో బ్రెండ‌న్ టేల‌ర్ (జింబాబ్వే), ఎల్ట‌న్ చిగుంబ‌రా (జింబాబ్వే), తిసారా పెరీరా (శ్రీలంక‌) ఈ ఫీట్ సాధించారు. ఇక భార‌త కెప్టెన్ల‌లో రెండు వ‌రుస టీ20 సిరీస్‌ల‌తో పాటు ఏడు మ్యాచ్‌ల్లో గెలుపు రుచి చూడ‌ని తొలి కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్ చెత్త రికార్డు న‌మోదు చేశాడు.

👉 భారత క్రికెటర్‌ ప్రిన్స్‌ యాదవ్‌ ఒక చెత్త రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. అంబ‌టి రాయుడు త‌ర్వాత తాను ఆడిన మొద‌టి నాలుగు మ్యాచ్‌ల్లోనూ ప్రిన్స్ యాద‌వ్ ఓట‌మి చ‌విచూడ‌డం గ‌మ‌నార్హం.

 

చదవండి: 'ఇది మాకు గుణ‌పాఠం.. ఓట‌మికి కారణం అదే'

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)