Breaking News

స్లో ఓవర్‌ రేట్‌.. టీమిండియాకు పడింది దెబ్బ

Published on Fri, 01/20/2023 - 16:08

భాగ్యనగరం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో విజయంతో ఉత్సాహంలో ఉన్న టీమిండియాకు బిగ్‌షాక్‌ తగిలింది. టీమిండియాకు స్లో ఓవర్‌ రేట్‌ దెబ్బ పడింది. నిర్ణీత సమయం ముగిసేలోగా రోహిత్‌ సేన మూడు ఓవర్లు తక్కువగా వేసినట్లు తేలడంతో మ్యాచ్‌ ఫీజులో 60 శాతం కోత విధించినట్లు ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ జగవల్‌ శ్రీనాథ్‌ తెలిపారు. 

ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కింద ఆర్టికల్‌ 2.22 ప్రకారం మ్యాచ్‌ నిర్ణీత సమయం ముగిసేలోగా టీమిండియా మూడు ఓవర్లు తక్కువ వేసినట్లు తేలడంతో స్లో ఓవర్‌ రేట్‌గా పరిగణించినట్లు తెలిపారు.  మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేసినందుకు టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో మూడు ఓవర్ల చొప్పున ఒక్కో ఓవర్‌కు 20 శాతం కింద మ్యాచ్‌ ఫీజులో 60 శాతం కోత విధించినట్లు ఐసీసీ పేర్కొంది. కాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన తప్పును అంగీకరించినట్లు వెల్లడించింది. దీంతో విచారణ అవసరం లేదని ఐసీసీ తెలిపింది. 

ఇక మ్యాచ్‌లో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. భాగ్యనగరం వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో బ్యాటర్లు పండుగ చేసుకున్నారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా శుబ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీతో మెరవడంతో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ మైకెల్‌ బ్రాస్‌వెల్ మెరుపు శతకంతో రాణించి టీమిండియాను వణికించాడు. అయితే లోకల్‌ బాయ్‌ సిరాజ్‌ చివర్లో అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో న్యూజిలాండ్‌ 337 పరుగులకు ఆలౌటైంది. సిరాజ్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. ఇక ఇరుజట్ల మధ్య రెండో వన్డే రాయ్‌పూర్‌ వేదికగా శనివారం(జనవరి 21న) జరగనుంది.

చదవండి: రెండో వన్డేలోనూ ఉమ్రాన్‌కు నో ఛాన్స్‌! ఒకవేళ ఆడించినా..

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)