Breaking News

Ind vs NZ: కివీస్‌తో మూడో టెస్టు.. ప్లాన్‌ ఛేంజ్‌.. ‘పిచ్‌’ మారింది!?

Published on Tue, 10/29/2024 - 16:27

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర పరాభవం పాలైన టీమిండియా.. ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలవాలని పట్టుదలగా ఉంది.  ఇందుకోసం రోహిత్‌ సేన పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. మరోవైపు పిచ్‌ విషయంలోనూ మేనేజ్‌మెంట్‌ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. వాంఖడే వికెట్‌ తొలిరోజు బ్యాటర్లకు పూర్తిగా అనుకూలించేలా రూపొందించారని వార్తలు వినిపిస్తున్నాయి.

డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరాలంటే
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) 2023-25లో భారత్‌కు ఇంకా ఆరు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఒకటి, ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. వీటిలో కనీసం మూడు గెలిస్తేనే తప్ప టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరేందుకు మార్గం సుగమం కాదు.  కాబట్టి న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై మిగిలిన మ్యాచ్‌ గెలిస్తేనే.. ఆస్ట్రేలియాలో ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టగలదు.

తొలిరోజు వారికే అనుకూలం!
అందుకే ఏ రకంగా చూసినా న్యూజిలాండ్‌తో ఆడబోయే మూడో టెస్టు భారత్‌కు అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో  వాంఖడేలో స్పోర్టింగ్‌ ట్రాక్‌ తయారుచేయించినట్లు తెలుస్తోంది. ‘‘ప్రస్తుతం పిచ్‌ మీద కాస్త పచ్చిక ఉంది. తొలిరోజు బ్యాటింగ్‌కు అనుకూలించేలా కనిపిస్తోంది. రెండో రోజు నుంచి బంతి కాస్త టర్న్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. 

రెండో రోజు నుంచే స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది’’ అని విశ్వసనీయవర్గాలు తెలిపినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. కాగా బెంగళూరు, పుణె టెస్టులో పిచ్‌ స్పిన్‌ బౌలింగ్‌కు బాగా అనుకూలించింది. ముఖ్యంగా రెండో టెస్టులో కివీస్‌ స్పిన్నర్‌ మిచెల్‌ సాంట్నర్‌ ఏకంగా పదమూడు వికెట్లు కూల్చి భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. 

టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ తమ స్పిన్‌తో ఆకట్టుకున్నప్పటికీ బ్యాటర్ల వైఫల్యం కారణంగా 113 పరుగుల తేడాతో ఓడి సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ క్రమంలో నవంబరు 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనున్న ఆఖరి టెస్టులో గెలిస్తేనే రోహిత్‌ సేన పరువు నిలుస్తుంది. 

చదవండి: IPL 2025: వాషింగ్టన్‌ సుందర్‌ కోసం ఎగబడుతున్న ఫ్రాంఛైజీలు 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)