Breaking News

సతీసమేతంగా టీమిండియాకు ఘన స్వాగతం.. వీడియో వైరల్‌

Published on Mon, 02/09/2026 - 09:52

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌-2026 టోర్నీని విజయంతో ఆరంభించింది టీమిండియా. ముంబై వేదికగా శనివారం అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. తదుపరి.. గురువారం నాటి మ్యాచ్‌లో నమీబియాతో భారత్‌ మ్యాచ్‌ ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానం ఇందుకు వేదిక.

సతీసమేతంగా
ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir) భారత జట్టును తమ ఇంటికి ఆహ్వానించాడు. తొలుత కారులో గంభీర్‌ తమ ఇంటికి చేరుకున్నాడు. అనంతరం భార్య నటాషా, పిల్లలతో కలిసి టీమిండియాను తమ నివాసానికి సాదరంగా ఆహ్వానించాడు.

ఇక కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, ఆటగాళ్లతో పాటు కోచ్‌లు, సహాయక సిబ్బంది, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా తదితరులు ఓల్డ్‌ రాజేంద్రనగర్‌లో ఉన్న గంభీర్‌ నాలుగు అంతస్థుల విలాస భవనానికి విచ్చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

అందుకే డిన్నర్‌ పార్టీలు
కాగా టీమిండియాకు ఆటవిడుపు కలిగించేందుకు, జట్టు సభ్యుల మధ్య స్నేహ భావం మరింత పెంపొందేలా గంభీర్‌ డిన్నర్‌ పార్టీలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగానూ ఇలాగే ఆటగాళ్లకు పార్టీ ఇచ్చాడు. 

ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు ఆటగాళ్ల మధ్య ఏవైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నా వాటికి పరిష్కారం చూపేలా హెడ్‌కోచ్‌ ఇలాంటి వేదికను ఏర్పాటు​ చేసినట్లు తెలుస్తోంది.

టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌.. గ్రూప్‌-ఎలో పాకిస్తాన్‌, నమీబియా, అమెరికా, నెదర్లాండ్స్‌ దేశాలతో కలిసి ఉంది. తొలుత అమెరికాతో మ్యాచ్‌ ఆడిన టీమిండియా.. ఆ తర్వాత గురువారం నమీబియా (ఫిబ్రవరి 12), ఆదివారం పాకిస్తాన్‌ (ఫిబ్రవరి 15).. లీగ్‌ దశలో చివరగా వచ్చే బుధవారం (ఫిబ్రవరి 18) నెదర్లాండ్స్‌తో తలపడేలా షెడ్యూల్‌ ఖరారైంది.

టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి భారత జట్టు
సూర్యకుమార్‌ యాదవ్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్‌ కెప్టెన్‌), రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్‌ చక్రవర్తి, వాషింగ్టన్‌ సుందర్‌, మొహమ్మద్‌ సిరాజ్‌.

చదవండి: T20 WC 2026: టీమిండియాతో ఆడతాం కానీ..: బుద్ధి చూపించిన పాకిస్తాన్‌!

 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)