Breaking News

T20 WC 2026: సూపర్‌-8లో టీమిండియా ప్రత్యర్థులు వీరే..!

Published on Tue, 02/17/2026 - 19:00

టీ20 ప్రపంచకప్‌ 2026 నుంచి ఆస్ట్రేలియా వైదొలగడంతో సూపర్‌-8 దశలో టీమిండియా ప్రత్యర్దులు ఖరారయ్యారు. సూపర్‌-8 గ్రూప్‌-1లో భారత్‌తో పాటు జింబాబ్వే,  సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ జట్లు ఉన్నాయి. గ్రూప్‌-1 మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరుగుతాయి.

  • భారత్‌ తమ తొలి సూపర్‌-8 మ్యాచ్‌ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.

  • భారత రెండో సూపర్‌-8 మ్యాచ్‌ ఫిబ్రవరి 26న జరుగనుంది. చెన్నైలోని చిదంబరంలో స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌లో భారత్‌ జింబాబ్వేను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌ కూడా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.

  • భారత్‌ తమ మూడో సూపర్‌-8 మ్యాచ్‌ను మార్చి 1న ఆడుతుంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో భారత్‌ వెస్టిండీస్‌ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్‌ కూడా రాత్రి 7 గంటలకే ప్రారంభమవుతుంది.

గ్రూప్‌-1లో మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఇలా..
-ఫిబ్రవరి 23- జింబాబ్వే వర్సెస్‌ వెస్టిండీస్‌ (ముంబై, రాత్రి 7 గంటలకు)
-ఫిబ్రవరి 26- వెస్టిండీస్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా (అహ్మదాబాద్‌, మధ్యాహ్నం 3 గంటలకు)
-మార్చి 1- జింబాబ్వే వర్సెస్‌ సౌతాఫ్రికా (ఢిల్లీ, మధ్యాహ్నం 3 గంటలకు)

మరోవైపు సూపర్‌-8 గ్రూప్‌-2 బెర్త్‌ల్లో ప్రస్తుతానికి మూడు ఖరారయ్యాయి. రేపు (ఫిబ్రవరి 18) జరుగబోయే మ్యాచ్‌లో నమీబియాపై గెలిస్తే.. పాక్‌ నాలుగో బెర్త్‌ దక్కించుకుంటుంది.  సూపర్‌-8 గ్రూప్‌-2లో న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, శ్రీలంక జట్లు ఉన్నాయి. గ్రూప్‌-2 మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. గ్రూప్‌-2కు సంబంధించి కూడా పలు సూపర్‌-8 మ్యాచ్‌లు ఖరారయ్యాయి.

-ఫిబ్రవరి 22న ఇంగ్లండ్‌-శ్రీలంక (పల్లెకెలె, మధ్యాహ్నం 3 గంటలకు)
-ఫిబ్రవరి 25న న్యూజిలాండ్‌-శ్రీలంక (కొలొంబో, రాత్రి 7 గంటలకు)
-ఫిబ్రవరి 27న ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ (కొలొంబో, రాత్రి 7 గంటలకు)

గ్రూప్‌-1, గ్రూప్‌-2లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.  సెమీస్‌ మ్యాచ్‌లు మార్చి 4, 5 తేదీల్లో జరుగుతాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు మార్చి 8న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. సెమీస్‌, ఫైనల్‌కు వేదికలు ఇంకా ఖరారు కాలేదు.

​

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)