IND vs USA: భారత తుదిజట్టు ఇదే.. ఇషాన్‌కు నో ఛాన్స్‌!

Published on Wed, 02/04/2026 - 15:10

పొట్టి క్రికెట్‌ సమరానికి రంగం సిద్ధమైంది. భారత్‌- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు శనివారం (ఫిబ్రవరి 7)న తెరలేవనుంది. ఈ ఐసీసీ ఈవెంట్లో తొలి రోజు మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. తొలుత కొలంబో వేదికగా పాకిస్తాన్‌- నెదర్లాండ్స్‌.. ఆ తర్వాత కోల్‌కతాలో వెస్టిండీస్‌- స్కాట్లాండ్‌.. అనంతరం ముంబై వేదికగా టీమిండియా- అమెరికా (IND vs USA) జట్లు తలపడతాయి.

ఇందుకోసం ఇప్పటికే జట్లన్నీ ప్రాక్టీస్‌ కూడా మొదలుపెట్టేశాయి. ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు ఎలా ఉండబోతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సంజూ శాంసన్‌ (Sanju Samson)ను ఓపెనర్‌గా కొనసాగిస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది.

వరుస వైఫల్యాలు
గత కొన్నాళ్లుగా సంజూ ఫామ్‌లేమి (10, 6, 0, 24, 6)తో సతమతమవుతుండటం ఇందుకు కారణం. అదే సమయంలో.. చాన్నాళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన మరో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ దుమ్ములేపుతున్నాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో వన్‌డౌన్‌లో వచ్చి ఆఖరి మ్యాచ్‌లో సెంచరీ (103)తో అదరగొట్టాడు.

తిలక్‌ వర్మ పునరాగమనం
కాగా తిలక్‌ వర్మ గాయం కారణంగా జట్టుకు దూరమైనంద వల్ల ఇషాన్‌ అతడి స్థానంలో వన్‌డౌన్‌లో వచ్చాడు. అయితే, వరల్డ్‌కప్‌ టోర్నీతో తిలక్‌ వర్మ పునరాగమనం చేయనున్నాడు. దీంతో ఇషాన్‌ను ఓపెనర్‌గా ప్రమోట్‌ చేసి.. సంజూపై మేనేజ్‌మెంట్‌ వేటు వేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇషాన్‌కు నో ఛాన్స్‌
ఇలాంటి తరుణంలో టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ ఆసక్తికర అంచనాతో ముందుకు వచ్చాడు. స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ.. అమెరికాతో తలపడే భారత తుదిజట్టును ఎంచుకున్న చహల్‌.. ఇషాన్‌ కిషన్‌ను పక్కనపెట్టడం విశేషం. అభిషేక్‌ శర్మతో కలిసి సంజూ శాంసన్‌ ఓపెనింగ్‌ చేయాలని అతడు అభిప్రాయపడ్డాడు.

ఇక మూడో స్థానంలోకి తిలక్‌ వర్మ తిరిగివస్తాడన్న చహల్‌.. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ యథావిధిగా నాలుగో నంబర్‌ బ్యాటర్‌గా బరిలోకి దిగుతాడని పేర్కొన్నాడు. హార్దిక్‌ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్‌.. మిడిలార్డర్‌, ఫినిషర్‌ పాత్రలు పోషిస్తారని తెలిపాడు.

కుల్దీప్‌నకు కూడా మొండిచేయి
తన జట్టులో ఇద్దరు స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తికి చోటిచ్చిన చహల్‌.. ఇద్దరు స్పెషలిస్టు సీమర్లుగా జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌లను ఎంచుకున్నాడు. 

ఈ క్రమంలో టాపార్డర్‌లో ఇషాన్‌ కిషన్‌తో పాటు.. స్పిన్‌ దళంలో కుల్దీప్‌ యాదవ్‌కు చహల్‌ మొండిచేయి చూపాడు. కాగా వరల్డ్‌కప్‌ టోర్నీలో ఇరవై జట్లు పాల్గొంటుండగా డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌.. పాకిస్తాన్‌, యూఎస్‌ఏ, నెదర్లాండ్స్‌, నమీబియాలతో కలిసి గ్రూప్‌-‘ఎ’లో ఉంది.

టీ20 వరల్డ్‌కప్‌-2026లో అమెరికాతో మ్యాచ్‌కు చహల్‌ ఎంచుకున్న భారత తుదిజట్టు
అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా.

చదవండి: ఇషాన్‌ కిషన్‌కు అండగా విరాట్‌ కోహ్లి

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)