Breaking News

T20 WC: నేపాల్‌తో మ్యాచ్‌.. ఇంగ్లండ్‌ తుదిజట్టు ప్రకటన

Published on Sat, 02/07/2026 - 16:34

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ మొదలైంది. పాకిస్తాన్‌- నెదర్లాండ్స్‌ మ్యాచ్‌తో శనివారం ఈ పొట్టి క్రికెట్‌ సంగ్రామానికి తెరలేచింది. తొలిరోజు ఈ మ్యాచ్‌తో పాటు.. వెస్టిండీస్‌- స్కాట్లాండ్‌.. టీమిండియా- యూఎస్‌ఏ మ్యాచ్‌లకు షెడ్యూల్‌ ఖరారైంది.

ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లు
ఇక గ్రూప్‌-సిలో ఉన్న ఇంగ్లండ్‌ తొలత నేపాల్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా ఆదివారం మ్యాచ్‌ జరుగనుండగా.. ఇందుకు సంబంధించి ఇంగ్లండ్‌ శనివారమే తమ తుదిజట్టును ప్రకటించింది. హ్యారీ బ్రూక్‌ సారథ్యంలోని ఈ జట్టులో ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లు ఆదిల్‌ రషీద్‌, లియామ్‌ డాసన్‌లకు చోటు దక్కింది.

హార్డ్‌ హిట్టర్‌ వచ్చేశాడు!
అంతేకాదు.. పూర్తి ఫిట్‌నెస్‌తో హార్డ్‌ హిట్టర్‌ ఫిల్‌ సాల్ట్‌ కూడా తుదిజట్టులోకి వచ్చేశాడు. సాల్ట్‌కు తోడు మాజీ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌తో పాటు కెప్టెన్‌ బ్రూక్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను మరింత పటిష్టం చేశారు. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో సామ్‌ కర్రాన్‌, విల్‌ జాక్స్‌, జేకబ్‌ బెతెల్‌ ఉన్నారు. 

పేస్‌ దళంలో జోఫ్రా ఆర్చర్‌, ల్యూక్‌ వుడ్‌ పేర్లు ఖరారయ్యాయి. కాగా ఇంగ్లండ్‌- నేపాల్‌ మధ్య ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్‌ ఆరంభం అవుతుంది.

టీ20 ప్రపంచకప్‌-2026: నేపాల్‌తో మ్యాచ్‌కు ఇంగ్లండ్‌ తుదిజట్టు
ఫిల్‌ సాల్ట్‌, జోస్‌ బట్లర్‌ (వికెట్‌ కీపర్‌), జేకబ్‌ బెతెల్‌, టామ్‌ బాంటన్‌, హ్యారీ బ్రూక్‌ (కెప్టెన్‌), సామ్‌ కర్రాన్‌, విల్‌ జాక్స్‌, లియామ్‌ డాసన్‌, జోఫ్రా ఆర్చర్‌, ఆదిల్‌ రషీద్‌, ల్యూక్‌ వుడ్‌.
బెంచ్‌: రెహాన్‌ అహ్మద్‌, జోష్‌ టంగ్‌, బెన్‌ డకెట్‌, జేమీ ఓవర్టన్‌.

వరల్డ్‌కప్‌ టోర్నీకి నేపాల్‌ జట్టు
రోహిత్ పౌడెల్ (కెప్టెన్‌), దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లమిచానే, కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, సందీప్ జోరా, ఆరిఫ్ షేక్, బసీర్ అహమద్, సోంపాల్ కమీ, కరణ్ కెసి, నందన్ యాదవ్, గుల్షన్ ఝా, లలిత్ రాజ్‌బన్షి, షేర్ మల్లా, లోకేష్ బామ్.

చదవండి: T20 WC: పాక్‌కు చుక్కలు చూపించిన పసికూన.. ఆఖరికి..

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)