Breaking News

పాక్‌పై మ్యాచ్‌ విన్నింగ్‌ శతకం.. రికార్డుల మోత మోగించిన బ్రూక్‌

Published on Wed, 02/25/2026 - 07:32

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో నిన్న (ఫిబ్రవరి 24) జరిగిన సూపర్‌-8 పోరులో పాకిస్తాన్‌పై ఇంగ్లండ్‌ అద్భుత విజయం సాధించింది. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ విధ్వంసకర శతకం (51 బంతుల్లో 100; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) బాది ఒంటిచేత్తో ఇంగ్లండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఎవరి సహకారం లేకున్నా బ్రూక్‌ ఒక్కడే ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చిన వైనం ప్రతి క్రికెట్‌ అభిమానిని ఆకట్టుకుంది.

చూడముచ్చటైన బౌండరీలు, భారీ సిక్సర్లతో అతను పాక్‌ బౌలర్లపై విరుచుకుపడిన తీరు కన్నుల పండుగలా ఉండింది. 165 పరుగుల లక్ష్య ఛేదనలో 17 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును బ్రూక్‌ అద్వితీయ శతకంతో గెలుపు తీరాల వరకు చేర్చాడు. 

అతనికి విల్‌ జాక్స్‌ (28), సామ్‌ కర్రన్‌ (16) నామమాత్రంగా సహరించారు. బ్రూక్‌ మూడంకెల స్కోర్‌ తర్వాత ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో రెండంకెల స్కోర్‌ చేసింది జాక్స్‌, కర్రన్‌ మాత్రమే. బ్రూక్‌ శతక్కొట్టుడు కారణంగా ఇంగ్లండ్‌ 19వ ఓవర్‌ తొలి బంతికి విజయతీరాలు తాకింది (8 వికెట్ల నష్టానికి).

ఈ మ్యాచ్‌ విన్నింగ్‌ శతకంతో బ్రూక్‌ రికార్డుల మోత మోగించాడు. తద్వారా తన జట్టును సెమీస్‌కు కూడా చేర్చాడు. బ్రూక్‌ సాధించిన ఆ రికార్డులు ఏంటంటే..?

టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ తరఫున ఫాస్టెస్ట్‌ సెంచరీ
హ్యారీ బ్రూక్‌- 50 బంతులు (తాజా మ్యాచ్‌లో)
అలెక్స్‌ హేల్స్‌- 60
జోస్‌ బట్లర్‌- 67

టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ చేసిన కెప్టెన్లు
బ్రూక్‌- 100 (తాజా మ్యాచ్‌లో)
క్రిస్‌ గేల్‌- 98 
లోర్కాన్‌ టక్కర్‌- 94 నాటౌట్‌
రోహిత్‌ శర్మ- 92

ఈ సెంచరీతో బ్రూక్‌ ఇంగ్లండ్‌ తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అతనికి ముందు జోస్‌ బట్లర్‌, డేవిడ్‌ మలాన్‌ ఈ ఘనత సాధించారు.

కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా ఇంగ్లండ్‌ నిలిచింది. ఈ జట్టు సూపర్‌-8లో వరుసగా శ్రీలంక, పాకిస్తాన్‌పై విజయాలు సాధించి, దర్జాగా సెమీస్‌కు చేరింది. ఇంగ్లండ్‌ చేతిలో ఓటమితో పాక్‌ సెమీస్‌ అవకాశాలు దాదాపుగా కోల్పోయినట్లే. 

అధికారికంగా గ్రూప్‌-2 నుంచి రెండో సెమీస్‌ బెర్త్‌ కోసం​ న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక పోటీ పడతాయి. గ్రూప్‌-1లో సెమీస్‌ రేసులో వెస్టిండీస్‌, సౌతాఫ్రికా దూసుకుపోతున్నాయి. సౌతాఫ్రికా చేతిలో భారీ ఓటమితో ఆ గ్రూప్‌లో భారత్‌ సెమీస్‌ బెర్త్‌ను సంక్లిష్టం చేసుకుంది.

 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)