Breaking News

కొత్త ఏడాది తొలి రోజునే సూర్య ఆసక్తికర పోస్టు

Published on Sun, 01/01/2023 - 12:58

టీమిండియా సంచలనం సూర్యకుమార్‌ యాదవ్‌ నూతన సంవత్సర వేడుకలను తనదైన స్టైల్లో సెలబ్రేట్‌ చేసుకున్నాడు. కొత్త సంవత్సరం తొలి రోజున ముంబైలోని ప్రఖ్యాత సిద్ది వినాయక గుడిని సందర్శించి దీవెనలు అందుకున్నాడు. సిద్ది వినాయక ఆశీర్వాదాలు అందుకున్నా.. ఈ ఏడాది అంతా మంచి జరగాలని కోరకున్నా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో షేర్‌ చేసి క్యాప్షన్‌ జత చేశాడు. 

ఇక సూర్యకుమార్‌ గతేడాది అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా టి20 క్రికెట్‌లో తనదైన మార్క్‌ చూపించిన సూర్యకుమార్‌ ఐసీసీ మెన్స్‌ టి20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు కూడా నామినేట్‌ అయ్యాడు. మిస్టర్‌ 360 పేరును సార్దకం చేసుకున్న సూర్యకుమార్‌ గతేడాది టి20 క్రికెట్‌లో 1164 పరుగులు చేసి 2022లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా తొలిస్థానంలో నిలిచాడు. అంతేకాదు 2022లో టి20 క్రికెట్‌లో 68 సిక్సర్లు బాది అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. రెండు సెంచరీలు సహా తొమ్మిది హాఫ్‌ సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి.

ఇక టి20 ప్రపంచకప్‌లో టీమిండియా తరపున రెండో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆరు మ్యాచ్‌లు కలిపి 189 స్ట్రైక్‌రేట్‌తో 239 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్థసెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది కూడా సూర్యకుమార్‌ తన ఫామ్‌ను కంటిన్యూ చేసి టీమిండియాను వన్డే వరల్డ్‌కప్‌లో విశ్వవిజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాలని కోరుకుందాం.

చదవండి: ఇలా చేయడం సిగ్గుచేటు.. రోహిత్‌ శర్మ భార్య ఆగ్రహం

మహిళా అథ్లెట్‌ కోచ్‌కు లైంగిక వేధింపులు.. క్రీడామంత్రిపై కేసు

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు