Breaking News

గిల్‌కు కొత్త పేరు పెట్టిన టీమిండియా దిగ్గజం

Published on Sun, 01/22/2023 - 13:45

టీమిండియా యువ సంచలనం శుబ్‌మన్‌ గిల్‌ ప్రస్తుతం అద్బుత ఫామ్‌లో ఉన్నాడు. హైదరాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో డబుల్‌ సెంచరీతో మెరిసిన గిల్‌.. రెండో వన్డేలోనూ 40 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ను ఆడి జట్టును గెలిపించాడు. దీంతో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే టీమిండియా 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక తన ఇన్నింగ్స్‌లతో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో పడిన గిల్‌పై టీమిండియా మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. 

రెండో వన్డే సందర్భంగా సునీల్‌ గావస్కర్‌ మ్యాచ్‌ కామెంటరీలో పాల్గొన్నాడు. లైవ్‌ జరుగుతున్న సమయంలోనే శుబ్‌మన్‌ గిల్‌కు గావస్కర్‌ కొత్త పేరును ప్రతిపాదిస్తున్నట్లు అడిగాడు. 'గిల్‌ నీకు ఒక నిక్‌నేమ్‌ పెడుతున్నా.. అదేంటో తెలుసా.. 'స్మూత్‌మాన్‌ గిల్‌'.. నీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా అంటూ కామెంట్‌ చేశాడు. కాగా గావస్కర్‌ కామెంట్‌పై గిల్‌ వెంటనే స్పందించాడు. ''అలా ఏం లేదు సార్‌.. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు.  

ఇక తొలి వన్డేలో డబుల్‌ సెంచరీతో మెరిసిన శుబ్‌మన్‌ గిల్‌ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. టీమిండియా నుంచి వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. టీమిండియా తరపున డబుల్‌ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఇక 19 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన గిల్‌ టీమిండియా తరపున వన్డేల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.

చదవండి: 'టీమిండియా రైట్‌ ట్రాక్‌లోనే వెళ్తుందా?'.. మీకేమైనా అనుమానమా!

'నాకు నచ్చలేదు.. బయోపిక్‌ నుంచి తప్పుకుంటున్నా' 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)