గౌరవం దక్కలేదన్నాడు!.. సూర్యకుమార్‌ పోస్ట్‌ వైరల్‌

Published on Tue, 07/07/2026 - 14:30

తన గురించి జరుగుతున్న ప్రచారంపై టీమిండియా మాజీ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ స్పందించాడు. అవన్నీ కేవలం కల్పితాలేనని.. అసత్య వార్తలను నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. అదే విధంగా.. టీమిండియా గొప్ప విజయాలు సాధించాలని.. జట్టుకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశాడు.

ఏకంగా జట్టు నుంచే తప్పించారు
కాగా ఈ ఏడాది భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ అందించిన సూర్యకుమార్‌పై యాజమాన్యం అనూహ్య రీతిలో వేటు వేసిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలిచినా.. ఆటగాడిగా విఫలమయ్యాడనే కారణంతో అతడిని ఏకంగా జట్టు నుంచే తప్పించారు సెలక్టర్లు.

సూర్య స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించింది బీసీసీఐ. అయితే, శ్రేయస్‌ సారథ్యంలో.. హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ మార్గదర్శనంలో టీమిండియాకు ఇటీవల ఘెర పరాభవం ఎదురైంది. ఐర్లాండ్‌ పర్యటనలో ఆతిథ్య జట్టు చేతిలో టీమిండియా ఊహించని విధంగా 2-0తో క్లీన్‌స్వీప్‌ అయింది.

అనంతరం ఇంగ్లండ్‌ పర్యటనను కూడా ఓటమితోనే మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యంపై విమర్శలు వస్తున్నాయి. సూర్యను తప్పించి పొరపాటు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం ఇలాగే స్పందించాడనే వార్త వైరల్‌ అయింది.

గౌరవం దక్కలేదన్నాడు!
తనను కెప్టెన్సీ నుంచి ఎందుకు తొలగించారో స్పష్టంగా తెలియదని.. సమాచారం కూడా ఇవ్వలేదని.. అసలు తనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని సూర్య అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ విషయంపై సూర్య తాజాగా సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు.

సూర్యకుమార్‌ పోస్ట్‌ వైరల్‌
‘‘భారత జట్టు కూర్పు పట్ల నేను సంతోషంగా ఉన్నాను. టీమిండియాకు మంచి జరగాలనే ఎల్లప్పుడూ కోరుకుంటాను. కుర్రాళ్లు ఎంతో గొప్పగా రాణిస్తున్నారు. వారికి నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది.

ముఖ్యంగా వైభవ్‌.. నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇది ఇంకాస్త ఆసక్తిగా సాగాలని నేను కోరుకుంటున్నా. ఆడుతున్న ప్రతీ క్షణాన్ని ఆస్వాదించు. దేశాన్ని గర్వపడేలా చేయాలి. ఇక సోషల్‌ మీడియాలో నేను అన్నట్లుగా ఓ వార్త ప్రచారం కావడం నా దృష్టికి వచ్చింది.

అవన్నీ తప్పుడు కథనాలు. నకిలీ వార్తలను నాకు ఆపాదిస్తున్నారు. నేను ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఇప్పుడు మీకు స్పష్టంగా తెలియజేస్తున్నా. ఇలాంటి అసత్య ప్రచారాలను దయచేసి నమ్మవద్దు.

భారత క్రికెట్‌, నా సహచర ఆటగాళ్లకు ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుంది. ఇలాంటి నకిలీ వార్తల కంటే ఆట గురించిన చర్చే ఎక్కువగా ఉంటుంది. ఉండాలి కూడా’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ ఎక్స్‌ వేదికగా క్లారిటీ ఇచ్చాడు.
చదవండి: మూడో టీ20కి ముందు వైభవ్‌కు గాయం!

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)