Breaking News

జట్టులో దండగ.. అతడినే టీమిండియా కెప్టెన్‌ని చేస్తారేమో!

Published on Thu, 07/09/2026 - 17:22

విదేశీ పర్యటనలో టీమిండియా టీ20 వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. తొలుత ఐర్లాండ్‌ చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్‌ అయిన భారత జట్టు.. ఇంగ్లండ్‌తో తొలి టీ20 వర్షం వల్ల రద్దు కావడంతో ఊపిరి పీల్చుకుంది. ఇక రెండు, మూడు మ్యాచ్‌లలో ఆతిథ్య ఇంగ్లండ్‌ గెలిచి 2-0తో ఆధిక్యంలో నిలిచింది.

వైస్‌ కెప్టెన్‌గా తిలక్‌ వర్మ
ఈ నేపథ్యంలో బ్రిస్టల్‌ వేదికగా గురువారం జరిగే నాలుగో టీ20లో టీమిండియా చావోరేవో తేల్చుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఐర్లాండ్‌ టూర్‌తో భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ పగ్గాలు చేపట్టగా.. తిలక్‌ వర్మ వైస్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.

అయితే, ఈ ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేయడం లేదు. శ్రేయస్‌ బ్యాటర్‌గా ఫర్వాలేదనిపిస్తున్నా.. సారథిగా వరుస పరాజయాలతో చెత్త రికార్డులు మూటగట్టుకుంటున్నాడు. మరోవైపు.. తిలక్‌ వర్మ ఆటగాడిగా ఫెయిల్‌ అవుతూ ఒక రకంగా జట్టుకు భారమయ్యాడని పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో తిలక్‌ రెగ్యులర్‌గా వచ్చే ఐదో స్థానంలో కాకుండా.. ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు చేయడం ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ తిలక్‌ వర్మపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు. సంజూ శాంసన్‌ పేరును ప్రస్తావిస్తూ తిలక్‌ వర్మ స్థానాన్ని ప్రశ్నించాడు.

అతడిని కెప్టెన్‌ను కూడా చేస్తారేమో
ఈ మేరకు తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ.. ‘‘తిలక్‌ ఇప్పటికే వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. పరిస్థితి చూస్తుంటే త్వరలోనే అతడిని కెప్టెన్‌ను కూడా చేస్తారేమో అనిపిస్తోంది. కాబట్టి జట్టులో తన స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని అతడు భావిస్తున్నాడేమో!..

ఏదేమైనా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అతడు పేస్‌, బౌన్స్‌ను ఎదుర్కొనే ధైర్యం లేక కాస్త ఆలస్యంగా బ్యాటింగ్‌కు వెళ్లినట్లు అనిపిస్తోంది. క్రీజులోకి వెళ్లాక కూడా.. దూకుడుగా ఆడలేక అతడు బిక్కమొఖం వేశాడు.

బలహీనత మీకు తెలుసు
తిలక్‌ వర్మ ప్రధాన బ్యాటర్‌గా భావించే అతడిని వైస్‌ కెప్టెన్‌ని చేశారు కదా!.. అయినా సరే ఫాస్ట్‌ బౌలింగ్‌ను ఎదుర్కోకుండా మీరే (యాజమాన్యం) అతడిని కాపాడుతున్నారు. అతడి బలహీనత మీకు తెలుసు కాబట్టే ఇలా చేస్తున్నారు.

అందుకే తిలక్‌కు బదులు అక్షర్‌ను ముందుగా పంపి బలిచేశారు. షార్ట్‌ పిచ్‌ బంతులను తిలక్‌ ఎదుర్కోలేడని మీకు ముందుగానే తెలుసు. అందుకే అతడి బలహీనతను కప్పిపుచ్చేందుకు అక్షర్‌ను ముందుకు తోశారు. 

ఆడలేక ఇబ్బంది పడుతున్నపుడు అతడిని జట్టు నుంచి తప్పించాలి. నేను పదే పదే ఈ మాట చెబుతున్నాను. తిలక్‌ వర్మకు బదులు సంజూ శాంసన్‌ను ఆడిస్తే బాగుంటుంది. 

కానీ యాజమాన్యం మాత్రం తిలక్‌ను తప్పించడం లేదు’’ అని క్రిస్‌ శ్రీకాంత్‌ చురకలు అంటించాడు. కాగా ఇంగ్లండ్‌తో తొలి టీ20లో 13 పరుగులు చేసిన తిలక్‌ వర్మ.. రెండో మ్యాచ్‌లో 24*, మూడో టీ20లో 3 పరుగులు చేసి నిష్క్రమించాడు.

చదవండి: తుదిజట్టులోకి సంజూ.. కానీ ఓ కండిషన్‌!

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)