Breaking News

IND vs ENG: అదంతా ఫేక్‌.. సిరాజ్‌ ఎలాంటివాడంటే?!

Published on Mon, 08/04/2025 - 13:01

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj)పై ఇంగ్లండ్‌ దిగ్గజ బ్యాటర్‌ జో రూట్‌ (Joe Root) ప్రశంసలు కురిపించాడు. సిరాజ్‌ మియాను నిజమైన పోరాట యోధుడిగా అభివర్ణించిన రూట్‌.. అతడి లాంటి ఆటగాడు ప్రతి జట్టులోనూ ఉండాలంటూ కొనియాడాడు. కొన్నిసార్లు కోపం వచ్చినట్లు ‘నటించినా’.. నిజానికి సిరాజ్‌ చాలా మంచోడంటూ ప్రశంసించాడు.

4 వికెట్లా?.. 35 పరుగులా?
ఇంగ్లండ్‌- భారత్‌ (IND vs ENG) మధ్య ఆండర్సన్‌- టెండుల్కర్‌ ట్రోఫీ సిరీస్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఐదు టెస్టుల్లో నాలుగు పూర్తికాగా.. ఆతిథ్య ఇంగ్లండ్‌ 2-1తో ఆధిక్యంలో ఉంది. 

ఇరుజట్ల మధ్య ఓవల్‌ టెస్టులో సోమవారం నాటి ఐదో టెస్టు ఐదో రోజు ఆటలో సిరీస్‌ ఫలితం తేలనుంది. టీమిండియా విజయానికి నాలుగు వికెట్ల దూరంలో ఉంటే.. ఇంగ్లండ్‌ గెలుపునకు 35 పరుగులు కావాలి.

ఇక భారత్‌ విధించిన 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ పటిష్ట స్థితిలో నిలవడానికి ప్రధాన కారణం.. జో రూట్‌ (105), హ్యారీ బ్రూక్‌ (111). ఈ ఇద్దరు అద్భుతమైన సెంచరీలతో రాణించి మ్యాచ్‌ను తమ వైపునకు తిప్పేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి నాలుగో రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన రూట్‌.. సిరాజ్‌ను ఆకాశానికెత్తాడు.

అదంతా ఫేక్‌.. నిజానికి చాలా మంచోడు
‘‘అతడికి పట్టుదల ఎక్కువ. అతడొక యోధుడు. నిజమైన పోరాట యోధుడు. అలాంటి ఆటగాడు తమ జట్టులో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. టీమిండియాను గెలిపించేందుకు సర్వస్వం ధారపోస్తాడు. అందుకు అతడిని తప్పక మెచ్చుకోవాల్సిందే.

ఆటగాడిగా అతడి దృక్పథం బాగుంటుంది. ఒక్కోసారి కోపం వచ్చినట్లు నటిస్తాడు. కానీ అంతలోనే కూల్‌ అయిపోతాడు. నిజానికి సిరాజ్‌ మంచివాడు. కాకపోతే తాను కాస్త కఠినంగా ఉంటానని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడంతే!

అతడు గొప్ప నైపుణ్యాలున్న ఆటగాడు. అందుకే వరుసగా వికెట్లు తీస్తూ ఈ స్థాయికి చేరుకున్నాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాడితో అతడితో తలపడటాన్ని నేను ఇష్టపడతాను. అతడి ముఖంపై చిరునవ్వు ఎప్పటికీ చెరగదు. 

అతడు ఏం చేసినా అది జట్టు కోసమే!.. యువ ఆటగాళ్లకు అతడు స్ఫూర్తిదాయకం’’ అని రూట్‌ సిరాజ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. కాగా ఇంగ్లండ్‌తో తాజా సిరీస్‌లో ఇప్పటికే సిరాజ్‌ 20 వికెట్లు కూల్చి.. టాప్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు. అంతేకాదు ఇప్పటికే అత్యధికంగా వెయ్యి బంతులు వేశాడు కూడా!!

టీమిండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ ఐదో టెస్టు
👉వేదిక: కెన్నింగ్‌టన్‌ ఓవల్‌, లండన్‌
👉టాస్‌: ఇంగ్లండ్‌.. మొదట బౌలింగ్‌
👉తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు: 224
👉తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ స్కోరు: 247
👉రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు: 396
👉374 పరుగుల లక్ష్య ఛేదనలో నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్‌ స్కోరు: 339/6 (76.2).

చదవండి: IND vs ENG: కామన్‌సెన్స్‌ లేదు.. నిజంగా సిగ్గుచేటు.. అరగంటలో ముగించేవారు!

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)