Breaking News

పుట్టినరోజున అదరగొట్టాడు.. నైంటీస్‌ ఫోబియా మాత్రం వదల్లేదు

Published on Thu, 09/08/2022 - 16:49

టీమిండియా యువ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఇవాళ(గురువారం) 23వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఆసియాకప్‌లో ఆడుతున్న టీమిండియా జట్టుకు ఎంపిక కాని గిల్‌ కౌంటీల్లో  ఆడుతూ బిజీగా ఉన్నాడు. కాగా పుట్టినరోజునాడే గిల్‌ తన డెబ్యూ కౌంటీ మ్యాచ్‌లో అదరగొట్టాడు. కౌంటి డివిజన్‌-1లో గ్లామోర్గాన్‌ తరపున ఆడుతున్న గిల్‌ వోర్సెస్టర్‌షైర్‌పై 92 పరుగులు సాధించాడు. అయితే 8 పరుగుల తేడాతో తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

కాగా గిల్‌కు నెర్వస్‌ నైంటీస్‌ ఫోబియా ఉంది.  ఇటీవలి కాలంలో గిల్‌ 90ల్లో చాలాసార్లు ఔటయ్యాడు. ఈ మధ్య జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో గిల్‌ తొలిసారి నైంటీస్‌ ఫోబియాను అధిగమించి సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తాజాగా మాత్రం మరోసారి 90ల్లోనే ఔటయ్యి నిరాశపరిచాడు. కాగా గిల్‌ 148 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 92 పరుగులు చేయగా.. వికెట్‌ కీపర్‌ కూక్‌ 51 నాటౌట్‌, ఎడ్‌వార్డ్‌ బైరోమ్‌ 67 పరుగులు చేశాడు.

ఈ ముగ్గురు మినహా మిగతవారు విఫలం కావడంతో గ్లామోర్గాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకు ఆలౌటై ఫాలోఆన్‌లో పడింది. కాగా వోర్సెస్టర్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 454 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. రోడ్రిక్‌ 172 పరుగులు నాటౌట్‌ అజేయ సెంచరీతో మెరవగా.. బర్నార్డ్‌ 75, జాక్‌ లీచ్‌ 87, ఎడ్‌ పొలాక్‌ 54 పరుగులు చేశారు. ఇక ఫాలోఆన్‌ ఆడుతున్న గ్లామోర్గాన్‌ వర్షంతో ఆట నిలిపివేసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా ఐదు పరుగులు చేసింది. గ్లామోర్గాన్‌ ఇంకా 154 పరుగులు వెనుకబడి ఉంది.

చదవండి: మ్యాచ్‌ను శాసించిన సిక్సర్ల కోసం బ్యాట్‌ను అప్పుగా..

ఆఫ్ఘన్‌ బౌలర్‌ను బ్యాట్‌తో కొట్టబోయిన పాక్‌ బ్యాటర్‌.. వైరల్‌ వీడియో

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)