Breaking News

సెమీ ఫైనల్లో యశస్వి జైస్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ఫెయిల్‌

Published on Thu, 09/04/2025 - 14:27

ఆసియా కప్‌-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) జట్టును ప్రకటించిన నాటి నుంచి రెండు పేర్లు చర్చనీయాంశమయ్యాయి. శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer), యశస్వి జైస్వాల్‌. ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో జైసూ కేవలం స్టాండ్‌ బై ప్లేయర్‌గా ఎంపికైతే.. శ్రేయస్‌ అందుకు కూడా నోచుకోలేదు.

సెమీ ఫైనల్‌లో ఇద్దరూ విఫలం
ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ముంబైకర్లకు మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలిచారు. శ్రేయస్‌, జైసూలకు ఆసియా కప్‌ జట్టులో చోటు ఇవ్వాల్సిందంటూ బీసీసీఐ తీరును విమర్శించారు. ఇలా చాన్నాళ్లుగా వార్తల్లో ఉన్న ఈ ఇద్దరు.. తాజాగా దులిప్‌ ట్రోఫీ-2025 సెమీ ఫైనల్‌ సందర్భంగా మైదానంలో తిరిగి అడుగుపెట్టారు.

వెస్ట్‌ జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న యశస్వి జైస్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌.. దులిప్‌ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో నిరాశపరిచారు. బెంగళూరు వేదికగా సెంట్రల్‌ జోన్‌తో గురువారం మొదలైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్ట్‌ జోన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌
ఈ క్రమంలో హర్విక్‌ దేశాయ్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన యశస్వి జైస్వాల్‌ దారుణంగా విఫలమయ్యాడు. మూడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌ బాది.. ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ఇక హర్విక్‌ ఒక్క పరుగు చేసి దీపక్‌ చహర్‌కు వికెట్‌ సమర్పించుకున్నాడు.

25 పరుగులు చేసిన అయ్యర్‌
వన్‌డౌన్‌లో వచ్చిన ఆర్య దేశాయ్‌ 39 పరుగులతో రాణించగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన శ్రేయస్‌ అయ్యర్‌ మాత్రం నిరాశపరిచాడు. 28 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ నాలుగు ఫోర్ల సాయంతో 25 పరుగులు సాధించాడు. షమ్స్‌ ములానీ 18 పరుగులు చేసి నిష్క్రమించాడు.

రుతురాజ్‌ గైక్వాడ్‌ అద్భుత ప్రదర్శన
అయితే, నాలుగో నంబర్‌ బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మాత్రం అద్భుత అర్ధ శతకం (94 నాటౌట్‌)తో రాణించి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. ఈ నేపథ్యంలో 45 ఓవర్ల ముగిసే సరికి వెస్ట్‌ జోన్‌ ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఇక సెంట్రల్‌ జోన్‌ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ రెండు, దీపక్‌ చహర్‌, సారాంశ్‌ జైన్‌, హర్ష్‌ దూబే ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

విండీస్‌తో ఆడే జట్టుకు ఎంపిక అవ్వాలంటే
కాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో దులిప్‌ ట్రోఫీ-2025లో సత్తా చాటాలని.. శ్రేయస్‌ అయ్యర్ పట్టుదలగా ఉన్నాడు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో నిరాశజనక ప్రదర్శనతో అతడి అవకాశాలు సన్నగిల్లినట్లే. రెండో ఇన్నింగ్స్‌లోనైనా రాణిస్తే భారత టెస్టు జట్టులోకి పునరాగమనం గురించి అయ్యర్‌ ఆశలు పెట్టుకోవచ్చు. మరోవైపు.. యశస్వి జైస్వాల్‌ టీమిండియా టెస్టు ఓపెనర్‌గా జట్టులో పాతుకుపోయిన విషయం తెలిసిందే.

చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన జింబాబ్వే ప్లేయర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)