Breaking News

గంభీర్ రాక.. ఆ ఆటగాడికి మళ్లీ పిలుపు! ఎవ‌రంటే?

Published on Fri, 07/12/2024 - 08:11

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడా? అంటే అవుననే అంటున్నాయి క్రికెట్‌ వర్గాలు. శ్రీలంకతో వన్డే సిరీస్‌తో అయ్యర్ పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా బీసీసీఐ ఆదేశాల‌ను ధిక్కరించిన అయ్యర్‌.. భారత జట్టులో చోటుతో పాటు వార్షిక కాంట్రాక్ట్ ను కూడా కోల్పోయిన విష‌యం తెలిసిందే.

అయితే ఇప్పుడు భారత కొత్త హెడ్ కోచ్‌గా  బాధ్యతలు చేపట్టిన గౌతం గంభీర్‌.. అయ్యర్ విషయంలో సానుకూలంగా ఉన్న‌ట్లు స‌మాచారం. అయ్య‌ర్ విష‌యంపై గంభీర్ బీసీసీఐ పెద్ద‌ల‌తో మాట్లాడ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. 

ఈ క్ర‌మంలోనే శ్రీలంక‌తో వ‌న్డే సిరీస్‌కు అయ్య‌ర్‌కు చోటు ద‌క్క‌నున్న‌ట్లు ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా వీరిద్ద‌రికి మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కెప్టెన్‌గా  శ్రేయ‌స్ అయ్య‌ర్ వ్య‌వ‌రిస్తుండ‌గా.. ఈ ఏడాది సీజ‌న్‌లో కేకేఆర్ మెంటార్‌గా గంభీర్ ప‌నిచేశాడు. 

వీరిద్ద‌రి నేతృత్వంలో పీఎల్‌-2024 ఛాంపియ‌న్స్‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ నిలిచింది. అదేవిధంగా అయ్యర్ కూడా మంచి టచ్‌లో కన్పించాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో అయ్యర్ తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.

మరోవైపు తన ఫిట్‌నెస్ కాపాడుకోవడానికి అయ్యర్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ముంబైలో వర్షంలో పడుతున్న సమయంలో కూడా తన ప్రాక్టీస్‌ను అయ్యర్ కొనసాగిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Videos

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)