శ్రేయస్‌ అయ్యర్‌కు భారీ షాక్‌!

Published on Tue, 01/20/2026 - 14:21

చాన్నాళ్లుగా టీమిండియా తరఫున వన్డేలకే పరిమితమయ్యాడు శ్రేయస్‌ అయ్యర్‌. దేశవాళీ టీ20 టోర్నీలో పరుగుల వరద పారించినా.. జట్టులో ఇప్పటికే పాతుకుపోయిన ఆటగాళ్ల కారణంగా అతడికి భారత టీ20 జట్టులో స్థానం కరువైంది.

అయితే, తిలక్‌ వర్మ గాయం కారణంగా అనూహ్య రీతిలో ఇటీవలే శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer)అంతర్జాతీయ పొట్టి క్రికెట్‌లో పునరాగమనం చేసే అవకాశం దక్కించుకున్నాడు. దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా హైదరాబాద్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మ (Tilak Varma)గాయపడిన విషయం తెలిసిందే.

శస్త్రచికిత్స విజయవంతం
పొట్ట కింది భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అతడికి టెస్టిక్యులర్‌ టార్షన్‌ సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ విషయాన్ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) సైతం ధ్రువీకరించింది.

వేగంగా కోలుకుంటున్న తిలక్‌
స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మూడు మ్యాచ్‌లకు తిలక్‌ వర్మ దూరమయ్యాడని బోర్డు తెలిపింది. ఈ క్రమంలోనే ఈ హైదరాబాదీ స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం తిలక్‌ వర్మ వేగంగా కోలుకుంటున్నట్లు సమాచారం.

బరిలోకి దిగేందుకు సై
టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రకారం.. తిలక్‌ వర్మకు నొప్పి నుంచి విముక్తి లభించింది. ఇప్పటికే అతడు ఫిజికల్‌ ట్రెయినింగ్‌ మొదలుపెట్టాడు. ఫిట్‌నెస్‌ పరీక్ష కోసం అతడు మంగళవారం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (CoE)కి చేరుకుంటాడు.

ఒకవేళ ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటే కివీస్‌తో నాలుగో టీ20 (జనవరి 28)కి తిలక్‌ వర్మ అందుబాటులోకి వస్తాడు. దీంతో శ్రేయస్‌ అయ్యర్‌ స్థానం గల్లంతు కావడం ఖాయం. అదే విధంగా.. తిలక్‌ గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌-2026లో ఆడాలన్న ఈ ముంబైకర్‌ ఆశలపై కూడా నీళ్లు చల్లినట్లు అవుతుంది. 

కాగా గత రెండేళ్లుగా భారత టీ20 జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన తిలక్‌ వర్మ.. ఆసియా కప్‌-2025 ఫైనల్లో జట్టును గెలిపించి ప్రశంసలు అందుకున్నాడు.

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్ (తొలి మూడు టీ20లు), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్‌ కెప్టెన్‌), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), రవి బిష్ణోయి.

చదవండి: బీసీసీఐ సంచలన నిర్ణయం!.. రో-కోలకు భారీ షాక్‌!

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)