Breaking News

శ్రేయస్‌ అయ్యర్‌ రీఎంట్రీ.. జింబాబ్వే టీ20 సిరీస్‌కు ఐపీఎల్‌ హీరోలు

Published on Tue, 06/18/2024 - 21:34

ఐపీఎల్‌ 2024 విన్నింగ్‌ కెప్టెన్‌ (కేకేఆర్‌) శ్రేయస్‌ అయ్యర్‌ జులై, ఆగస్ట్‌ నెలల్లో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడని తెలుస్తుంది. వివిధ కారణాల చేత టీ20 వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపిక కాని శ్రేయస్‌.. లంకతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని సమాచారం.

మరోవైపు ఐపీఎల్‌ 2024 హీరోలు అభిషేక్‌ శర్మ, రియాన్‌ పరాగ్‌, మయాంక్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా, నితీశ్‌ రెడ్డి, విజయ్‌కుమార్‌ వైశాఖ్‌, యశ్‌ దయాల్‌ జులై 6 నుంచి జింబాబ్వేతో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఎంపికయ్యే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరందరూ బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.

వీరితో పాటు టీ20 వరల్డ్‌కప్‌కు ట్రావెలింగ్‌ రిజర్వ్‌లుగా ఎంపికైన శుభ్‌మన్‌ గిల్‌, ఆవేశ్‌ ఖాన్‌, రింకూ సింగ్‌, ఖలీల్‌ అహ్మద్‌ కూడా జింబాబ్వే సిరీస్‌కు ఎంపికవుతారని తెలుస్తుంది. జింబాబ్వే పర్యటనకు హార్దిక్‌ పాండ్యా కెప్టెన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికవుతారని ప్రచారం జరుగుతుంది. 

జింబాబ్వే సిరీస్‌కు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, బుమ్రా లాంటి సీనియర్లకు విశ్రాంతినిస్తారని సమాచారం. జింబాబ్వే పర్యటన కోసం భారత జట్టును వచ్చే వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం టీమిండియా టీ20 ప్రపంచకప్‌ 2024తో బిజీగా ఉంది. మెగా టోర్నీలో భారత్‌ సూపర్‌-8కు అర్హత సాధించింది. సూపర్‌-8లో టీమిండియా.. ఆఫ్ఘనిస్తాన్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లతో తలపడనుంది.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)