Breaking News

నాకు సూర్య అవన్నీ చెప్పాడు: శ్రేయస్‌ అయ్యర్‌

Published on Wed, 07/01/2026 - 15:50

టీమిండియా టీ20 కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన శ్రేయస్‌ అయ్యర్‌కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత జట్టు పసికూన ఐర్లాండ్‌ చేతిలో 2-0తో వైట్‌వాష్‌ అయింది. దీంతో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు.. హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌పైనా విమర్శల వర్షం కురుస్తోంది.

ఇక ఐర్లాండ్‌ పర్యటన ముగించుకున్న టీమిండియా ఇంగ్లండ్‌లో అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య బుధవారం నుంచి టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన శ్రేయస్‌ అయ్యర్‌కు.. మాజీ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ గురించి ప్రశ్న ఎదురైంది.

సూర్య నాతో మాట్లాడాడు
ఇందుకు బదులిస్తూ.. ‘‘సూర్యకుమార్‌ యాదవ్‌, నేనూ దాదాపుగా ఒకేలా ఆలోచిస్తాము. దేశవాళీ క్రికెట్‌లో అతడితో కలిసి చాలా ఏళ్లు ఆడాను. ఇక్కడికి వచ్చేముందు కూడా సూర్య నాతో మాట్లాడాడు.

యాజమాన్యం ఎలా పనిచేస్తుంది.. వివిధ సందర్భాల్లో ఆటగాళ్లు ఎలా స్పందిస్తారు.. వారి ఆలోచనలు ఏవిధంగా ఉంటాయన్న అంశాలపై నాకు ఇన్‌పుట్స్‌ ఇచ్చాడు. మా మధ్య సంభాషణ అర్థవంతంగా సాగింది. అతడి నుంచి నేర్చుకోవాల్సి చాలానే ఉంది’’ అని శ్రేయస్‌ అయ్యర్‌ పేర్కొన్నాడు.

అనూహ్య రీతిలో వేటు 
కాగా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన సూర్యకుమార్‌ యాదవ్‌పై యాజమాన్యం అనూహ్య రీతిలో వేటు వేసింది. కెప్టెన్‌గా రాణించినా బ్యాటర్‌గా విఫలం కావడమే ఇందుకు ప్రధాన కారణం. 

అయితే, సూర్యకు ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా మరొక్క అవకాశం ఇస్తారని భావించినా.. యాజమాన్యం మాత్రం అతడిని సారథ్య బాధ్యతల నుంచే కాకుండా.. జట్టు నుంచీ తొలగిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.

చదవండి: IND vs ENG: షెడ్యూల్‌, జట్లు.. టైమింగ్స్‌.. పూర్తి వివరాలు

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)