Breaking News

BCCI: శ్రేయస్‌ అయ్యర్‌ డిశ్చార్జ్‌.. కానీ..

Published on Sat, 11/01/2025 - 11:31

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer)  ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. శ్రేయస్‌ అయ్యర్‌ ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని.. అతడు వేగంగా కోలుకుంటున్నట్లు తెలిపింది. 

బీసీసీఐ వైద్య బృందం, సిడ్నీలోని స్పెషలిస్టులు అతడి రికవరీ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని.. శనివారం అతడిని డిశ్చార్జ్‌ చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. కాగా భారత వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సిడ్నీలో ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తూ అయ్యర్‌ గాయపడిన విషయం తెలిసిందే. 

పక్కటెముకల్లో అంతర్గత రక్తస్రావం
హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో ఆసీస్‌ ఆటగాడు అలెక్స్‌ క్యారీ ఇచ్చిన రన్నింగ్‌ క్యాచ్‌ పట్టే ప్రయత్నంలో శ్రేయస్‌ పక్కటెముకలకు బలమైన గాయమైంది. దీంతో వైద్య సిబ్బంది సహాయంతో అతడు మైదానాన్ని వీడగా... ఆ తర్వాత పరిస్థితి తీవ్రతను గుర్తించి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసీయు)కు తరలించారు.

స్పందించిన శ్రేయస్‌
పక్కటెముకల్లో అంతర్గత రక్తస్రావాన్ని గుర్తించి వైద్యం అందించగా... శ్రేయస్‌ త్వరితగతిన కోలుకుంటున్నాడు. ఈ విషయంపై గతంలోనే భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటన విడుదల చేసింది. అయితే రెండోసారి వైద్య పరీక్షల అనంతరం శ్రేయస్‌ కూడా సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. 

‘ప్రస్తుతం కోలుకునే ప్రక్రియలో ఉన్నాను. రోజు రోజుకు మరింత మెరుగ్గా అనిపిస్తుంది. క్లిష్ట సమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని శ్రేయస్‌ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. గాయం కారణంగా మైదానాన్ని వీడినప్పటి నుంచి అయ్యర్‌... బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలోనే ఉండగా.. తాజాగా అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినట్లు బోర్డు తెలిపింది.

వారికి బీసీసీఐ థాంక్స్‌
ఈ సందర్భంగా.. సిడ్నీ డాక్టర్‌ కొరొష్‌ హగిగి, అతడి వైద్య బృందానికి.. అదే విధంగా.. భారత్‌కు చెందిన డాక్టర్‌ దిన్షా పార్దీవాలాకు బీసీసీఐ ధన్యవాదాలు చెప్పింది. శ్రేయస్‌ అయ్యర్‌ త్వరగా కోలుకునేలా మెరుగైన చికిత్స అందించినందుకు కృతజ్ఞతలు తెలిపింది.

డిశ్చార్జ్‌ అయినా
కాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినా శ్రేయస్‌ అయ్యర్‌ మరికొన్నాళ్లు పాటు సిడ్నీలోనే ఉండనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. చికిత్స అనంతర పరీక్షల కోసం అతడు సిడ్నీలోనే ఉంటాడని.. విమాన ప్రయాణం చేయొచ్చని వైద్యులు చెప్పిన తర్వాతే భారత్‌కు తిరిగి వస్తాడని తెలిపింది.

చదవండి: రోహిత్‌ శర్మ ఆల్‌టైమ్‌ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బాబర్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)