Breaking News

శిఖర్‌ ధావన్‌ -సోఫీ షైన్‌ సంగీత్‌ నైట్‌, ఫోటోలు వైరల్‌

Published on Thu, 02/19/2026 - 18:26

Shikhar&Sophie టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్, ప్రియురాలు సోఫీ షైన్ (Sophie Shine) పెళ్లి సందడి మొదలైంది.  అయేషా ముఖర్జీతో విడాకుల తరువాత ధావన్‌ తన జీవితంలో మరో కీలక అడుగు వేయబోత్తున్నాడు. భారత క్రికెట్ జట్టులో తనదైన శైలిలోబ్యాటింగ్ చేస్తూ ‘గబ్బర్’గా పాపులర్‌ అయిన శిఖర్ ధావన్, వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్నిప్రారంభించబోతున్నాడు. తన ప్రేయసి సోఫీ షైన్‌ (ఐరిష్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్) తో కలిసి ఏడడుగులు వేసేందుకు ఆయన సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి 19 గురువారం ధావన్ తన సంగీత్ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇవి నెట్టింట సందడిగా మారాయి. అభినందనల వెల్లువ కురుస్తోంది. 

తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో శిఖర్ ధావన్‌  సోఫీ షైన్ సంగీత్ నైట్ నుండి ఫోటోలను షేర్ చేశాడు. ఆ ఫోటోల్లో శిఖర్ తెల్లటి షేర్వానీలో అందంగా కనిపించగా, సోఫీ బ్లింగీ గా బంగారు రంగు లెహంగాలో  కళకళలాడింది.  ఈ ఏడాది జనవరి 2న ఈ జంట నిశ్చితార్థం  చేసుకున్నారు. ఫిబ్రవరి 19న  వివాహం చేసుకోవచ్చని ముందుగా ఊహాగానాలు వచ్చాయి.  ప్రస్తుతం వెడ్డింగ్‌డేట్‌పై ధృవీకరణ లేనప్పటికీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా  జరిగిన సంగీత్ నైట్‌ ఫోటోలు మాత్రం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

 

ఎవరీ సోఫీ షైన్‌
సోఫీ షైన్ 1990 లో జన్మించిన ఐరిష్ మహిళ.  సోఫీ ఐర్లాండ్‌లో చదువుకుంది. ప్రఖ్యాత లిమెరిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నత విద్యను పూర్తి చేసింది.ఆమె గ్లామర్ ప్రపంచం నుండి రాలేదు, శిఖర్ లాగా కాకుండా, కార్పొరేట్ ప్రపంచంలో తనకంటూ ఒక పేరు తెచ్చుకోవడానికి ఆమె చాలా కష్టపడింది.మమార్కెటింగ్ మరియు మేనేజ్‌మెంట్ విద్యార్థిని అయిన ఆమె తొలుత బహుళజాతి కంపెనీలో  పనిచేసింది. అనంతరం  నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్‌లో చేరింది.దుబాయ్‌లోని ఒక రెస్టారెంట్‌లో మొదటి సారి కలిశారు. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా సోఫీ షైన్, శిఖర్ ధావన్‌తో సన్నిహితంగా కనిపించినప్పుడు  వీరి డేటింగ్ బజ్ ప్రారంభమైంది.

కాగా  శిఖర్ 2012లో అయేషాను వివాహం చేసుకున్నాడు.  ఈ జంటకు జోరావర్ అనే కుమారుడు ఉన్నాడు. 2021లో వారు విడాకులు తీసుకున్నారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)