శశాంక్‌ సింగ్‌ పరువు తీసిన శ్రేయస్‌ అయ్యర్‌!

Published on Mon, 04/20/2026 - 13:42

ఐపీఎల్‌-2026లో పంజాబ్‌ కింగ్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో గతేడాది ఫైనల్‌ చేరిన పంజాబ్‌.. ఈసారి కూడా ప్లే ఆఫ్స్‌ దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా పంజాబ్‌ కింగ్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లోనూ శ్రేయస్‌ సేన దుమ్ములేపింది.

సొంత వేదిక ముల్లన్‌పూర్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో రికార్డు స్థాయిలో 254 పరుగులు సాధించింది. ప్రియాన్ష్‌ ఆర్య (37 బంతుల్లో 93) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. కూపర్‌ కన్నోలి (46 బంతుల్లో 87) మరోసారి ఆకట్టుకున్నాడు.

రాణించిన బౌలర్లు
ఇక లక్ష్య ఛేదనలో లక్నోను పంజాబ్‌ 200 పరుగులకే పరిమితం చేసింది. మార్కో యాన్సెన్‌ రెండు, అర్ష్‌దీప్‌ సింగ్‌, విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌, యజువేంద్ర చహల్‌ తలా ఒక వికెట్‌ తీసి పంత్‌ సేనను కట్టడి చేశారు. ఫలితంగా పంజాబ్‌ 54 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.

మూడు క్యాచ్‌లు జారవిడిచాడు
అయితే, పంజాబ్‌ స్టార్‌ శశాంక్‌ సింగ్‌ లక్నోతో మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు క్యాచ్‌లు జారవిడిచాడు. ముఖ్యంగా లక్నో ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్లో పంజాబ్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ బంతితో రంగంలోకి దిగగా.. ఐడెన్‌ మార్క్రమ్‌ భారీ షాట్‌ ఆడాడు.

ఈ క్రమంలో స్వీపర్‌ కవర్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న శశాంక్‌ సింగ్‌ బంతిని అందుకునేందుకు పరిగెత్తుకు వచ్చాడు. ఆల్‌మోస్ట్‌ క్యాచ్‌ పడతాడని భావించగా.. అక్కడే అలా నిలుచుండిపోయాడు. దీంతో మార్క్రమ్‌ ఖాతాలో సిక్సర్‌ చేరగా.. అర్ష్‌దీప్‌ సింగ్‌తో పాటు డగౌట్‌లో ఉన్న హెడ్‌కోచ్‌ రిక్కీ పాంటింగ్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

మార్క్రమ్‌తో పాటు ముకుల్‌​ చౌదరీతో పాటు నికోలస్‌ పూరన్‌ల క్యాచ్‌లను శశాంక్‌ జారవిడిచాడు. ఈ ముగ్గరూ డేంజరస్‌ ప్లేయర్లే. అయితే, పంజాబ్‌ బౌలర్లను వాళ్లను సరిగ్గా కుదురుకోనివ్వలేదు కాబట్టి సరిపోయింది లేదంటే ఫలితంపై ప్రభావం పడేది. ఈ నేపథ్యంలో శశాంక్‌ సింగ్‌పై విమర్శల వర్షం కురుస్తుండగా.. మ్యాచ్‌ తర్వాత కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ చేసిన పని నెటిజన్లను ఆకర్షిస్తోంది.

ఇదిగో ఈ క్యాప్‌ అడ్డుపెట్టుకో
విజయం తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలోశ్రేయస్‌ శశాంక్‌ను ఆటపట్టించాడు. సరదాగా శశాంక్‌ భుజంపై చెయ్యి వేసిన శ్రేయస్‌ అయ్యర్‌... ‘‘మన జట్టు సభ్యులకు నీ ముఖం చూపించలేవులే.. మనోళ్లను కదిలించేంత దమ్ము ఇపుడు లేకపోవచ్చు... ఇదిగో ఈ క్యాప్‌ అడ్డుపెట్టుకో’’ అన్నట్లుగా క్యాప్‌ అతడి ముఖానికి అడ్డుపెట్టి నడిపించాడు. పాంటింగ్‌ సైతం శశాంక్‌ భుజం తట్టి నవ్వులు చిందించాడు. 

ఈ నేపథ్యంలో.. ‘‘శ్రేయస్‌ భయ్యా పాపం శశాంక్‌ పరువు తీసేశావుగా!.. ఏదేమైనా ఈరోజు శశాంక్‌ అదృష్టం బాగుంది’’ అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా శశాంక్‌ ఈ మ్యాచ్‌లో ఆరు బంతుల్లో 17 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. పంజాబ్‌ ఇప్పటికి ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఒకటి వర్షం వల్ల రద్దుకాగా.. మిగిలిన ఐదూ గెలిచి పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

చదవండి: PSL: పిరికిపందలు.. ఎక్స్‌ట్రాలు వద్దు.. పాక్‌ బోర్డుకు ఘాటు కౌంటర్‌

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)